Pawan Kalyan: దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన నిజమైన నేత ఎవరంటే సుభాష్ చంద్ర బోస్ అని సమాధానం వస్తుంది. మహాత్మాగాంధీ వెనకుండి పోరాటం చేస్తే సుభాష్ ముందుండి భారత జాతిని నడిపించారు. స్వాతంత్ర్యం వైపు అడుగులు వేయించారు. యువతలో దేశభక్తి నింపారు. మాకు రక్తమివ్వండి మీకు స్వాతంత్ర్యం ఇస్తాం అంటూ ప్రజల్లో దేశభక్తిని ఇనుమడింపజేసిన మహానేత. నేతాజీ అనే పేరుకు సార్థకంగా ఆయన మన జాతికే మార్గదర్శకంగా నిలిచారు. స్వాతంత్ర్య పోరాటంలో దూకుడు ప్రదర్శించారు. శాంతితో లాభం లేదని ఎదురునిలిచి పోరాడేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
Pawan Kalyan
మహాత్మాగాంధీకి నోటుపై ముద్రించి విలువ ఇచ్చిన మన ప్రభుత్వం సుభాష్ ను మాత్రం మరిచిపోవడం బాధాకరం. దేశ స్వాతంత్ర్యంలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడని నేతాజీ జీవిత చరిత్ర చదివితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. జైహింద్ అనే నినాదంతో ప్రజల్లో దేశభక్తి పెరిగేలా చేసిన నేత మన నేతాజీ. అంతేకాదు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఎదురు నిలిచి పోరాడితే ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లిపోతారని నమ్మిన వ్యక్తి సుభాష్. కానీ చరిత్రలో ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది.
Also Read: RRR Movie Review: రివ్యూ : ‘ఆర్ఆర్ఆర్’
ఇప్పటికైనా మనం నేతాజీని స్మరించుకుని ఆయన చూపిన మార్గంలోనే నడవాల్సిన అవసరం ఏర్పడింది. దేశం కోసం ఆత్మబలిదానానికైనా సిధ్ధంగా ఉండాలని నేతాజీ పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకుని లక్షలాది మంది తమ ప్రాణాలు తృణంగా భావించి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని వారి దేశభక్తిని చాటుకున్నారు. వారి ఫలితంగానే మనం స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నాం. కానీ వారికి మార్గనిర్దేశం చేసిన నేతను మాత్రం మనం గుర్తుంచుకోవడం లేదు.
Pawan Kalyan
నేతాజీ అస్థికలు రెంకోజీ ఆలయంలో ఉన్నా వాటి గురించి పట్టించుకోవడం లేదు. వాటిని తీసుకొచ్చి పరీక్షిస్తే అవి ఆయనవా కావా అనే అనుమానాలు కూడా తొలగిపోతాయని తెలిసినా మన పాలకుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. నేతాజీ మరణంపై ఇప్పటికీ మిస్టరీగానే ఉండటం దారుణం. ఆయన మృతిపై నిజానిజాలు వెలికితీసి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత దేశ నాయకులపై ఉందని గుర్తుంచుకోవాలి. దీనికి అందరు సహకరించాలని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ కోరారు. పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన ఆయన ఈమేరకు ప్రసంగించారు. ఎంవీఆర్ శాస్త్రి రచించిన నేతాజీ గ్రంథ సమీక్ష లో పాల్గొన్నారు.
Also Read: RRR Movie Special Story: స్పెషల్ స్టోరీ ఆర్ఆర్ఆర్ మూవీ జర్నీ ఎలా మొదలైంది?