Homeఎంటర్టైన్మెంట్RRR Movie Review: రివ్యూ :  'ఆర్ఆర్ఆర్'

RRR Movie Review: రివ్యూ :  ‘ఆర్ఆర్ఆర్’

RRR Movie Review: తారాగణం : ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్,  ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్  తదితరులు.

దర్శకత్వం  :  ఎస్. ఎస్. రాజమౌళి,
ఛాయాగ్రహణం కె.కె.సెంథిల్ కుమార్
 కూర్పు  : శ్రీకర్ ప్రసాద్
సంగీతం,  నేపధ్య సంగీతం:  ఎం. ఎం. కీరవాణి,
నిర్మాత  : డి.వి.వి దానయ్య.

RRR Movie Review
RRR Movie Review

భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈ రోజు భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. సినిమా చూసిన ప్రేక్షకులు విజిల్స్ తో కేకలతో ఊగిపోతున్నారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.

Also Read: RRR Movie Special Story: స్పెషల్ స్టోరీ ఆర్ఆర్ఆర్ మూవీ జర్నీ ఎలా మొదలైంది?

కథ :     

గోండు పిల్ల‌ మల్లికను బ్రిటిష్ దొర, దొరసాని బలవంతంగా తీసుకువెళ్తారు. తన గోండు జాతి కోసం ప్రాణం ఇచ్చే కొమురం భీమ్ (ఎన్టీఆర్) త‌మ‌ గూడెం పిల్ల కోసం ఢిల్లీలో అడుగుపెడతాడు. అత్తర్ (ఎన్టీఆర్)గా వేషం మార్చుకుని మల్లిక కోసం వెతుకుతూ ఉంటాడు. అంతలో కొమురం భీం (ఎన్టీఆర్) సంగతి తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం.. అతన్ని ప‌ట్టుకునే బాధ్య‌తను సీతారామ‌రాజు (రామ్ చరణ్)కు అప్పగిస్తోంది. రామరాజు (చరణ్) తన లక్ష్యం కోసం ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఇలా భీమ్ – కొమురం భీమ్ ఎవరి లక్ష్యాల వైపు వాళ్ళు సాగుతూనే.. ఇద్దరు ప్రాణ స్నేహతులుగా మారతారు. ఈ మధ్యలో జెన్నీ ( ఒలీవియా)కి దగ్గర కావడానికి భీమ్ చేసే ప్రయత్నాలకు రామరాజు (చరణ్) సాయం చేస్తుంటాడు.
అయితే, ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరు ఒకరి పై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తోంది.
అసలు రామరాజు లక్ష్యం ఏమిటి ? భీమ్ ఎందుకు జెన్నీ చుట్టూ తిరుగుతాడు ? భీమ్ ను అనుకోకుండా కలుసుకున్న సీత‌ (అలియా భట్) రామరాజు గతం గురించి ఏమి చెపుతుంది ? చివరకు బ్రిటిష్ ప్రభుత్వం పై భీమ్, రామరాజు కలిసి ఎలాంటి పోరాటం చేశారు ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

అద్భుతమైన యాక్షన్ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామాగా సాగిన ఈ సినిమాలో పవర్ ఫుల్ ఎమోషన్స్ తో పాటు భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. రాజమౌళి డైరెక్షన్ అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్‌, చరణ్‌ ల నటన హృదయాలను హత్తుకుంది.  ఇద్దరి పాత్రల మధ్య  ఎమోషన్స్ గుండె బరువెక్కేలా ఉన్నాయి.  ఇద్దరి ఐడియాలజీ పూర్తిగా  వేరు అయినా..  రెండు పాత్రల మధ్య బాండింగ్ ను రాజమౌళి చాలా  బాగా  ఎలివేట్ చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్  తన పరిపక్వతమైన నటనతో అబ్బురపరిచాడు. చరణ్ ఎంత గొప్ప నటుడో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది.

RRR Movie Review
RRR Movie Review

మెయిన్ గా ఇంటర్వెల్ కి ముందు ఇద్దరి మధ్య భీకరమైన పోరు సీక్వెన్స్ అయితే వండర్ ఫుల్ గా ఉంది. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ కూడా సూపర్. హీరోలిద్దరూ తమ పాత్రల కోసం పోటీ పడి మరీ కష్టపడ్డారు. అలాగే ప్రధాన పాత్రలో నటించిన అజయ్ దేవగణ్  కూడా చాలా బాగా నటించాడు.  హీరోయిన్స్ గా నటించిన అలియా భట్, ఒలీవియా మోరిస్  తమ నటనతో  ఎమోషనల్ సీన్స్ తో మెప్పించారు.

దర్శకుడు రాజమౌళి  ఒక పాత్రకి మరో పాత్రకు  మధ్య  మంచి వైవిధ్యాన్ని చూపించాడు. అలాగే ప్రతి పాత్రను కథలో కలిసిపోయేలా ప్లే రాసుకోవటం కూడా  బాగా ఆకట్టకుంది. కానీ, అలియా భట్ – చరణ్ ల మధ్య లవ్ ట్రాక్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేదు. ఎన్టీఆర్ – చరణ్ రెగ్యులర్ మాస్ ను ఎక్కువగా  ఎక్స్ పెక్ట్ చేసి వెళ్ళినా నిరాశ కలుగుతుంది. పైగా ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత విషయం సెకెండ్ హాఫ్ లో లేదు. కొన్ని సీన్స్ కూడా స్లోగా సాగుతాయి.

ప్లస్ పాయింట్స్ :

ఎన్టీఆర్ – చరణ్ నట విశ్వ‌రూపం,

కథ కథనాలు, డైలాగ్స్,

ఎమోషనల్ సీన్స్,

రాజమౌళి స్క్రీన్ ప్లే.

సాంగ్స్,

విజువల్స్ అండ్ ఎమోషన్స్.

మైనస్ పాయింట్స్  :

చరణ్ – అలియా లవ్ ట్రాక్,

సెకండ్ హాఫ్ లో వచ్చే స్లో సీన్స్,

చిన్న పాయింట్ బేస్ చేసుకుని మొత్తం కథ సాగడం,

చివరగా :

ఈ విజువల్ ఎమోషనల్  క్లాసిక్ డ్రామాలో.. ఇటు ఎన్టీఆర్, అటు చరణ్ ఇద్దరు అల్టిమేట్ యాటిట్యూడ్ తో యాక్టింగ్ తో దుమ్ము దులిపేశారు. అభిమానులకు ఈ సినిమాలోని క్యారెక్టరైజేషన్స్, ఎమోషన్స్, మరియు సాంగ్స్ ఇలా ప్రతిదీ ఆకట్టుకుంది. ఒక్కమాటలో ఆర్ఆర్ఆర్ ఎమోషనల్ యాక్షన్ విజువల్ ట్రీట్ కి ఒక ఫీస్ట్ లాంటిది.

రేటింగ్ : 4. 2 / 5

Also Read: Mahesh Babu About RRR: ‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ చెప్పిన మహేష్ !

 

LIVE: రాజమౌళి అద్భుతం చేశాడంటున్న ఫ్యాన్స్.! || RRR Movie Public Talk || Ok Telugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

5 COMMENTS

  1. […] Upasana RRR Movie: గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా.. ఎవరిని మాట్లాడించినా ఒక‌టే టాక్ వినిపిస్తోంది. సౌత్ నుంచి నార్త్ దాకా.. ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా త్రిబుల్ ఆర్ మేనియానే కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా సినీ ప్రేక్షకుల ఎదురు చూపులకు ఈరోజు తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఆర్ ఆర్ ఆర్ జాతర షురూ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది. […]

  2. […] Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా దూకుడు మరింత పెరుగుతోంది. నెల రోజులుగా భీకర దాడులతో రెచ్చగొడుతోంది. ఉక్రెయిన్ పై ముప్పేట దాడికి ముమ్మరంగా రష్యా ముందుకెళ్తోంది. రష్యా చర్యలతో యావత్ ప్రపంచమే బాధ్యత వహించాల్సి వస్తోంది. దీనికి ముగింపు పలకాలని భావించి నాటో సభ్య దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. తగిన ఆర్థిక సాయంతోపాటు సైనిక సాయం చేయడానికి ముందుకొచ్చాయి. రష్యా బెదిరింపులను తిప్పి కొట్టాలని భావిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ కు కూడా నైతిక బలం పెరిగినట్లు అవుతోంది. అమెరికా కూడా సైనిక, ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చింది. […]

  3. […] Mahesh Rajamouli Movie:  టాలీవుడ్ సినిమాలను ప్రపంచ స్థాయికి చేర్చిన ఘనత రాజమౌళిదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు సినిమాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆయన ఏ సినిమా చేసినా అంతకుమించి అన్నట్లుగానే ఉంటుంది. స్వతహాగా ఆయన రైటర్ కాకపోయినా.. కథలో ఎలాంటి మార్పులు చేయాలి, పాత్రలు ఎలా ఉండాలి, ఒక కథను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో ఎలాంటి ఎమోషన్స్ ఉండాలో రాజమౌళికి బాగా తెలుసు. […]

  4. […] RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమాలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని తెలుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుల ఇతివృత్తంగా తీసుకున్న కథ కావడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. మొదటి ఆట చూసేందుకే ఇష్టపడుతున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్, రాంచరణ్ సరసన అలియాభట్ నటిస్తున్నారు. […]

Comments are closed.

Exit mobile version