ఆ సీటుపై వకీల్‌ సాబ్‌ సంజాయిషీ

కేంద్ర సర్కార్‌‌ ఛాన్స్‌ దొరికిందని ఇష్టం వచ్చినట్లు పన్నులు బాదుతోంది. అంతేకాదు.. దేశంలోని పలు కేంద్ర రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ వస్తోందిజ దీనిపై ఆ పార్టీపై ఆశలు ప్రజల్లో రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. ఇక ఏపీలో ఇప్పటికే లోకల్‌ ఎలక్షన్స్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని బీజేపీ.. తిరుపతి సీటు మాత్రం తమకే కావాలంటూ పట్టుబట్టింది. అనుకున్నట్లుగానే అధిష్టానాన్ని ఒప్పించుకొని స్వయంగా మిత్రపక్షమైన పవన్‌ కల్యాణ్‌తో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలో బీజేపీ […]

Written By: Srinivas, Updated On : March 15, 2021 12:55 pm
Follow us on


కేంద్ర సర్కార్‌‌ ఛాన్స్‌ దొరికిందని ఇష్టం వచ్చినట్లు పన్నులు బాదుతోంది. అంతేకాదు.. దేశంలోని పలు కేంద్ర రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ వస్తోందిజ దీనిపై ఆ పార్టీపై ఆశలు ప్రజల్లో రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. ఇక ఏపీలో ఇప్పటికే లోకల్‌ ఎలక్షన్స్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని బీజేపీ.. తిరుపతి సీటు మాత్రం తమకే కావాలంటూ పట్టుబట్టింది. అనుకున్నట్లుగానే అధిష్టానాన్ని ఒప్పించుకొని స్వయంగా మిత్రపక్షమైన పవన్‌ కల్యాణ్‌తో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలో బీజేపీ పోటీ పడుతుందని చేయించింది బీజేపీ అగ్రనాయకత్వం.

ఈ ప్రకటనతో ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన పార్టీ శ్రేణులు ఒక్కసారిగా నిరాశ, నిస్పృహలకు లోనయ్యాయి. గెలుపోటముల సంగతి పక్కన పెడితే బీజేపీకి అండదండగా నిలుస్తున్న పార్టీకి శూన్య హస్తాలు, శుష్క వాగ్దానాలు మిగులుతున్నాయి. ఇదే భావన పవన్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఏర్పడుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతి నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందని రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు చెబుతూ వచ్చారు. అది సాధ్యం కాదని, బీజేపీయే పోటీకి దిగుతోందని స్పష్టమైపోయింది. తమ అధినేత చేసిన ప్రకటన కూడా పార్టీ పరమైన నిస్సహాయతనే వెల్లడించింది.

తిరుపతిలో బీజేపీ పోటీపై పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. బీజేపీ విజయానికి కృషి చేయాలన్న ఆయన పిలుపులో అనేక అనుమానాలు తొంగి చూశాయి. పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురవుతారన్న విషయం ఆయన లేఖతోనే స్పష్టమైంది. లేఖ సారాంశమంతా సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టుగానే కొనసాగింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీ పోటీకి అంగీకరించాల్సి వచ్చిందన్న విషయాన్ని చెప్పడానికి పవన్ ప్రయత్నించారు. హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో సాగిన లోతైన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడం విడ్డూరం. తిరుపతిలో బీజేపీ పోటీ చేయాల్సిన అవసరాన్నివారు వివరించారనేది పవన్ వాదన. అసలు తిరుపతిలో జనసేన పోటీ చేయాల్సిన అవసరాన్ని వివరించి పవన్ బీజేపీని ఎందుకు ఒప్పించలేకపోయారన్నది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయితే తిరుపతిని అభివృద్ధి చేస్తుందన్న పవన్ వాదన అర్థరహితం. భాగస్వామి ప్రాతినిధ్యం వహించినా, వేరే ప్రతిపక్షం అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది. శాంతిభద్రతల విషయంలో అరాచకాలను అరికట్టాలంటే బీజేపీ పోటీ పడాలన్న పవన్ వాదన కూడా సరైంది కాదు. బీజేపీ, జనసేన కలిసికట్టుగా ప్రభుత్వ అరాచకాలు, దమన కాండపై ప్రతిఘటించాలి. అంతే తప్ప తిరుపతిలో పోటీకి , శాంతిభద్రతలను పోల్చడం ఏంటి..? బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ బలం అంతంతమాత్రమే. తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టంగా మారింది. అటు వైసీపీ, ఇటు టీడీపీకి ఉన్న బలహీనతల కారణంగా ఒక ప్రబలమైన శక్తిగా కనిపిస్తోంది. ప్రజల్లో పలుకుబడి పెద్దగా లేదు. జనసేనను ఆసరాగా చేసుకుంటూ ఎదగాలని చూస్తోంది. అయితే జనసేనను ఎదగకుండా చేసి తాను పైచేయి సాధించాలన్న ఎత్తుగడలు స్వార్థ పూరితమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి ఈ ఎన్నికల్లో జనసైనికులు బీజేపీకి చిత్తశుద్ధితో సహకరిస్తారా.. లేక ప్లేటు ఫిరాయిస్తారా..? చూడాలి.