విద్యుత్ రంగంలో తెలంగాణ అద్భుత విజయాలు

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో ప్రభుత్వం అద్భుత విజయాలు సాధించిందని గరవ్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక పద్దును ఆమోదించేందుకు ఉభయసభలనుద్దేశించిన గవర్నర్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. దేశంలో 24 గంటల పాటు విద్యుత్ అందించే తొలి రాష్ట్రంగా రికార్డు సాధించిందని, విద్యుత్ రంగంలో అనేక విజయాలు సాధించిందన్నారు. గృహం, పరిశ్రమలకు 24 […]

Written By: NARESH, Updated On : March 15, 2021 1:00 pm
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో ప్రభుత్వం అద్భుత విజయాలు సాధించిందని గరవ్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక పద్దును ఆమోదించేందుకు ఉభయసభలనుద్దేశించిన గవర్నర్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు.

దేశంలో 24 గంటల పాటు విద్యుత్ అందించే తొలి రాష్ట్రంగా రికార్డు సాధించిందని, విద్యుత్ రంగంలో అనేక విజయాలు సాధించిందన్నారు. గృహం, పరిశ్రమలకు 24 గంటల పాటు విద్యుత్ ను అందిస్తున్నామని, జాతీయ సగటు కంటే రాష్ట్ర విద్యుత్ తలసరి వినియోగం ఎక్కువగా ఉందన్నారు. విద్యుత్ సంస్కరణలపై రాష్ట్రాన్ని కేంద్రం ప్రశంసించిందన్నారు.

తలసరి ఆదాయం విషయంలో రాష్ట్రప్రభుత్వం రూ. 2 లక్షల 28 వేలకు పెరిగిందన్నారు. కోవిడ్ వల్ల అనేక రాష్ట్రాలు ఇబ్బందికి గురయ్యాయయని, అయినా ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ, వ్యూహాత్మకంగా అడుగులు వేసి సమస్యలపై పోరాడామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఇదే కాకుండా ఎన్నో ఇబ్బందులను రాష్ట్రం ఎదుర్కొంటుందని, వాటి పరిష్కారాలపై దృష్టి సారించామన్నారు. వనరులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తోందన్నారు.

ప్రభుత్వం పథకాల అమలులో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీ ద్వారా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా పురాతన చెరువులను పునరుద్ధరించామని, దాదాపు 30 వేల చెరువులు ఈ పథకం కిందికి వచ్చాయన్నారు. ఇక మిషన్ భగీరథలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు.