కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగనుంది. కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి ఈ విషయాలను వెల్లడించారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన గొప్ప సంస్కరణగా ఈ నిర్ణయాన్ని పేర్కొనవచ్చని ఆయన అన్నారు. నేషనల్ రిక్రూట్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.
Also Read: ప్రజలకు ఫ్రీగా వాషింగ్ మెషీన్, కేబుల్ టీవీ.. ఎక్కడంటే..?
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వెల్లడించారు. నిరుద్యోగ అభ్యర్థులకు గతంతో పోలిస్తే రవాణా ఖర్చులతో పాటు పరీక్ష ఫీజులు కూడా భారీగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ పరీక్ష జరగనుందని తెలుస్తోంది. కేంద్రమంత్రి జీతేంద్ర సింగ్ ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు.
Also Read: ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు.. ఎలా అంటే..?
నేషనల్ రిక్రూట్ ఏజెన్సీ ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలను కూడా భర్తీ చేయనుందని సమాచారం. నేషనల్ రిక్రూట్ ఏజెన్సీ ఈ పరీక్షలకు సంబంధించి స్వతంత్ర బోర్డ్ గా వ్యవహరించనుంది. నేషనల్ రిక్రూట్ ఏజెన్సీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించబోయే పరీక్షలను ఈ బోర్డ్ నిర్వహించినట్టు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
అయితే నేషనల్ రిక్రూట్ ఏజెన్సీ ఏర్పడినా ఎస్ఎస్‌సీ , ఆర్‌ఆర్‌బీ , ఐబీపీఎస్ పరీక్షల నిర్వహణకు ఎటువంటి ఆటంకం ఏర్పడదని తెలుస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గురించి నిరుద్యోగుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.