
Pawan Delhi Tour: జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఢిల్లీ(Delhi Tour) బాటపట్టారు. అనూహ్యంగా ఆయనకు ఢిల్లీ పిలుపు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లడం ఆసక్తి రేపుతోంది.
మంగళవారం ఉదయం పవన్ ఢిల్లీ చేరుకున్నారు. తొలుత ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. తదుపరి భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రితో పవన్ భేటి చర్చనీయాంశమైంది. దానికి కారణాలపై జనసేన వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అపాయింట్ మెంట్ దొరికితే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతోనూ భేటి అవుతారని తెలుస్తోంది.
ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని పవన్ ముందుకెళుతున్నారు. ఈక్రమంలోనే వన్ ను ఢిల్లీ పిలిపించడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కేంద్రమంత్రి పదవి కోసం అప్పట్లో పవన్ ను పరిగణలోకి తీసుకున్నారని చాలా వార్తలు వచ్చినా కేంద్రకేబినెట్ లో చోటు దక్కలేదు. ఇప్పుడు సడెన్ గా పవన్ ను ఎందుకు పిలిచారన్నది మాత్రం తెలియడం లేదు. పవన్ ఢిల్లీ పర్యటనపై చాలా రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. నాలుగు సినిమాలు లైన్లో పెట్టి వాటిని పూర్తి చేసే పనిలో పడ్డారు. తిరుపతి ఉప ఎన్నిక, కరోనా సోకిన తర్వాత రాజకీయ వేడి తగ్గించారు. ఇటీవల రహదారుల సమస్య సహా పలు విషయాల్లో జనసేన తరుఫున ఒంటరిగా పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పెద్దల నుంచి పవన్ కు పిలుపురావడం ఆసక్తి రేపుతోంది.