https://oktelugu.com/

KTR: ప్రతిపక్షాలను ఎన్ కౌంటర్ చేసిన కేటీఆర్

KTR who encountered the Opposition in the TRS Plenary : అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రతిపక్షాలపై మండిపడుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా విస్తరించామని చెప్పుకుంటున్న జాతీయ పార్టీలు చేస్తున్న చిల్లర రాజకీయాలపై విమర్శలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లే అందరికి పదవులు వచ్చినా ఆ గురుతర బాధ్యత మరుస్తున్నారని చెబుతోంది. కేసీఆర్ పుణ్యమాని పదవులు అనుభవించే చోటామోటా నాయకులు చిల్లర మాటలు మాట్లాడడం సబబు కాదని చెబుతున్నారు. వయసులో అందరికంటే పెద్దవారైన […]

Written By: , Updated On : September 7, 2021 / 08:53 PM IST
Follow us on

KTR who encountered the Opposition in the TRS Plenary : అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రతిపక్షాలపై మండిపడుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా విస్తరించామని చెప్పుకుంటున్న జాతీయ పార్టీలు చేస్తున్న చిల్లర రాజకీయాలపై విమర్శలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లే అందరికి పదవులు వచ్చినా ఆ గురుతర బాధ్యత మరుస్తున్నారని చెబుతోంది. కేసీఆర్ పుణ్యమాని పదవులు అనుభవించే చోటామోటా నాయకులు చిల్లర మాటలు మాట్లాడడం సబబు కాదని చెబుతున్నారు. వయసులో అందరికంటే పెద్దవారైన కేసీఆర్ కు కనీస గౌరవం ఇవ్వకుండా పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ నిందించడం సరికాదని పేర్కొంది.

ప్రత్యర్థుల విమర్శలకు దీటుగా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ సభలో బదులిచ్చారు. 60 లక్షల పైచిలుకు సభ్యులతో పార్టీ బలంగా ఉంది. 33 జిల్లాల్లో జిల్లా పార్టీ కార్యాలయాలు కట్టుకుని ఢిల్లీలో తెలంగాణ భవన్ కు సైతం భూమి పూజ చేసుకుంది. పార్టీ పటిష్టంగా ఉందని తెలుస్తోంది. ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ దే గెలుపు కావడంతో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. గ్రేటర్ పరిధిలో 4800 దాకా కాలనీ అసోసియేషన్ లు ఉన్నాయి. 1486 నోటిఫైడ్ బస్తీలున్నాయి. మొత్తం 6300 దాకా కాలనీలు, బస్తీలు ఉన్నట్లు తెలుస్లోంది.

24 గంటల కరెంటు తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీనే. రైతులకు ఉఛితంగా నిరంతర విద్యుత్ అందించడంతో వారిలో సంతోషం వెల్లివిరుస్తోంది. నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్యను రూపుమార్చాం. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నాం. పంచాయతీ ఎన్నికలైనా, పరిషత్ ఎన్నికలైనా టీఆర్ఎస్ వశమే అవుతాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించి అందరికంటే ముందున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో 9, మున్సిపల్ న్నికల్లో 135 స్థానాల్లో గులాబీ జెండా ఎగిరింది.

త్వరలో పార్టీ నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. 500 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తి చేశారు. పార్టీ కోసం పనిచేసే వారికి కచ్చితంగా సముచిత ప్రాధాన్యం లభిస్తుంది. దసరా, దీపావళి తర్వాత కమిటీలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో సమర్థవంతంగా పనిచేయాలని సూచిస్తున్నారు. ఏ పార్టీకి లేని నాయకులు మన పార్టీకి ఉన్నారు. అందుకే క్రమశిక్షణతో పనిచేయాలని చెబుతున్నారు.