Actress Nivetha Pethuraj: హీరోయిన్ గా నివేదా పేతురాజ్ కి ( Nivetha Pethuraj) పెద్దగా గుర్తింపు రాలేదు, కానీ హీరోయిన్ కంటే ఆమెకు ఎక్కువ క్రేజ్ ఉంది. సౌత్ సినిమాల్లో వైవిధ్యమైన పాత్ర ఉంటే చాలు, ముందుగా ఆమెనే అడుగుతున్నారు. ఏది ఏమైనా నివేదా పేతురాజ్ మంచి టాలెంటెడ్ అనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు నివేదా పేతురాజ్ నటించిన ప్రతి పాత్ర ఆమెకు మంచి పేరే తెచ్చి పెట్టింది. ఇక అందంలో, అభినయంలో కూడా నివేదా పేతురాజ్ లో ఎటువంటి వంక పెట్టలేం.
దీనికితోడు ఈ డస్కీ బ్యూటీ యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. పైగా ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలందరికి కరెక్ట్ జోడీ. అన్నిటికీ మించి నిర్మాతల హీరోయిన్. ఎక్కువ రెమ్యునరేషన్ అడగదు. ఎక్కువ డిమాండ్స్ చేయదు. ఇన్నీ మంచి లక్షణాలు ఉన్నప్పటికీ నివేదా పేతురాజ్ కి మాత్రం సాలీడ్ అవకాశాలు రావడం లేదు. మరి తేడా ఎక్కడ జరుగుతోంది ?
ఈ విషయంలో తనకు ఏమి అర్థం కావడం లేదు అని ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో నివేదా చాలా బాధ పడింది కూడా. తనను ఒకపక్క టాలెంటెడ్ హీరోయిన్ అంటూనే, మరోపక్క కేవలం సెకండ్ హీరోయున్ గానే చూస్తున్నారు అంటూ ఆమె చెప్పుకుని బాధ పడింది. తనకు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ఆమె కుమిలిపోయింది.
కానీ, ఈ మధ్య నివేదా పేతురాజ్ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. పూర్తిగా సైడ్ పాత్రల కోసం ఆమెను అడుగుతున్నారట. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ పాత్రలు వచ్చేవి. ఇప్పుడు చిన్న హీరోల సినిమాల్లో కూడా నివేదా పేతురాజ్ కు సైడ్ పాత్రలే వస్తున్నాయట. టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నా.. ఆమెను ఇంకా హీరోయిన్ గుర్తించకపోవడం బాధాకరమైన విషయమే.
ఈ లెక్కన ఇక నివేదా పేతురాజ్ సోలో హీరోయిన్ గా ఎప్పుడు సక్సెస్ లు అందుకోవాలి, నివేదా పేతురాజ్ కి మాత్రం ఎప్పటి నుంచో సోలో హీరోయిన్ గా నటించి ఫేమ్ తెచ్చుకోవాలని కలలు కంటూ ఉంది. మరి ఎప్పటికైనా నివేదా పేతురాజ్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.