పార్టీ వాయిదా.. కేసీఆరే షర్మిల టార్గెట్

తెలంగాణలో పార్టీ పెట్టడానికి వడివడిగా సమావేశాలు పెట్టి.. ఖమ్మం సభలో పార్టీని ప్రకటిస్తుందని ఆశించిన వారికి వైఎస్ షర్మిల షాక్ ఇచ్చింది. ఖమ్మం సంకల్ప సభలో అసలు పార్టీని ఇప్పుడే పెట్టడం లేదని.. వైఎస్ఆర్ జయంతి అయిన జూలై 8వ తేదిన పార్టీ ప్రారంభించబోతున్నట్టు వైఎస్ షర్మిల తెలిపారు. ఉద్యమకారులను కేసీఆర్ పక్కనపెట్టారని.. ఇప్పుడు ఆయన చుట్టూ భజన బ్యాచే ఉందని షర్మిల ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దొరగారి(కేసీఆర్) ఎడమకాలి చెప్పుకింద నలిగిపోతోందని షర్మిల దుయ్యబట్టారు. […]

Written By: NARESH, Updated On : April 10, 2021 11:31 am
Follow us on

తెలంగాణలో పార్టీ పెట్టడానికి వడివడిగా సమావేశాలు పెట్టి.. ఖమ్మం సభలో పార్టీని ప్రకటిస్తుందని ఆశించిన వారికి వైఎస్ షర్మిల షాక్ ఇచ్చింది. ఖమ్మం సంకల్ప సభలో అసలు పార్టీని ఇప్పుడే పెట్టడం లేదని.. వైఎస్ఆర్ జయంతి అయిన జూలై 8వ తేదిన పార్టీ ప్రారంభించబోతున్నట్టు వైఎస్ షర్మిల తెలిపారు.

ఉద్యమకారులను కేసీఆర్ పక్కనపెట్టారని.. ఇప్పుడు ఆయన చుట్టూ భజన బ్యాచే ఉందని షర్మిల ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దొరగారి(కేసీఆర్) ఎడమకాలి చెప్పుకింద నలిగిపోతోందని షర్మిల దుయ్యబట్టారు. తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నామని ప్రశ్నించారు. నీళ్లు కేసీఆర్ ఫాంహౌస్‌కు .. నిధులు కేసీఆర్ కుటుంబానికి.. నియామకాలు కేసీఆర్ ఇంటికి అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

ఖమ్మం ప్రజా సంకల్ప సభలో వైఎస్ షర్మిల ప్రధానంగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశాడు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ ఎంతో అవినీతికి పాల్పడ్డారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించడానికి మన పార్టీ అవసరమన్నారు.

మహిళలు లక్షాధికారులు కావాలని వైఎస్ కలలు కన్నారని.. కానీ కేసీఆర్ హయాంలో కేసీఆర్ చెప్పిన కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైందని షర్మిల ప్రశ్నించారు. ప్రైవేటు రంగంలోనూ వైఎస్ 11 లక్షల ఉద్యోగాలు కల్పించారని.. ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి ఏమైందని షర్మిల ప్రశ్నించారు.

వైఎస్ హయాంలో 46 లక్షల ఇళ్లు కట్టించారని.. కేసీఆర్ ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలని షర్మిల నిలదీశారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూశాం.. జీతాలు పెంచమంటే.. తమ అభ్యర్థులను గెలిపిస్తేనే పీఆర్సీ అంటూ బెదిరించి ఓట్లు వేయించుకున్నారని కేసీఆర్ సర్కారుపై షర్మిల మండిపడ్డారు. హైకోర్టు లాయర్లను నడిరోడ్డుపై హత్య చేసినా.. చర్యలేవని ప్రశ్నించారు షర్మిల. వారి ప్రాణాలకు విలేవదన్నారు