Parliament Election 2024 : 5వ విడత ఎన్నికలు పూర్తి.. అమేథి, రాయ్ బరిలీ మీదే అందరి గురి..!

ఇక గత ఎన్నికల్లో రాయబరేలి నుంచి పోటీ చేసిన సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో..ఆ స్థానంలో కొత్తవారికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. దీంతో ఈసారి అమేథీ,రాయ్ బరిలీలలో ఏపార్టీ అభ్యర్థి గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Written By: NARESH, Updated On : May 20, 2024 7:18 pm

Parliament Election 2024

Follow us on

Parliament Election 2024 : దేశ వ్యాప్తంగా 5 విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 49 లోక్ సభ సెగ్మెంట్లకు సీఈసీ ఎలక్షన్స్ ను కంప్లీట్ చేసింది. మొత్తం 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. యూపీ 13, బెంగాల్ 07,మహారాష్ర్ట 13, బీహార్,ఒడిశా 05 చొప్పున కాశ్మీర్&లడక్,జార్ఖండ్ రాష్ట్రాల్లో మిగిలిన స్థానాలకు ఎలక్షన్స్ జరిగాయి. ఐదవ విడత పోలింగ్ పూర్తితో.. దేశవ్యాప్తంగా 428 లోక్సభ స్థానాలకు ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి.

ఈ విడతలో మొత్తం 49 పార్లమెంట్ సెగ్మెంట్లకు సిఈసి ఎలక్షన్స్ ను కండక్ట్ చేయగా..అందరి దృష్టి మాత్రం ఉత్తరప్రదేశ్ లోని రెండు కీలక స్థానాలపైనే ఉంది. ఈ రెండు స్థానాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే వ్యవహారమే ఆసక్తికరంగా మారింది. గతంలో రాయ్ బరేలి,అమేథీ నియోజక వర్గాలు కాంగ్రెస్ కు కంచుకోటలుగా ఉండేవి. ఇక్కడి నుంచి ఆ పార్టీ ఆగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ బరిలో ఉండేవారు. అయితే 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి ఇక్కడ నుంచి మరోసారి పోటీ చేసేందుకు రాహుల్ ఆసక్తిని ప్రదర్శించలేదు. కాంగ్రెస్ తరపున అమేథీ నుంచి ఈసారి గాంధీ కుటుంబానికి అత్యంత లాయల్గా ఉండే మరో వ్యక్తిని ఆపార్టీ బరిలో నిలిపింది. ఇక బిజెపి మాత్రం ఎప్పటిలాగే స్మృతి ఇరానీనే తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.

ఇక గత ఎన్నికల్లో రాయబరేలి నుంచి పోటీ చేసిన సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో..ఆ స్థానంలో కొత్తవారికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. దీంతో ఈసారి అమేథీ,రాయ్ బరిలీలలో ఏపార్టీ అభ్యర్థి గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.