Sudheer-Rashmi : యాంకర్ రష్మి – సుడిగాలి సుధీర్ లవ్ ట్రాక్ అప్పట్లో ఒక సెన్సేషన్. దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఈ జంట ఆన్ స్క్రీన్ పై కెమిస్ట్రీ పండించారు. స్కిట్ లో భాగంగా సరదాగా స్టార్ట్ అయిన వారి ప్రేమాయణం పీక్స్ కి వెళ్ళింది. సుధీర్ – రష్మీ నిజంగానే ప్రేమలో ఉన్నారని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అంతగా ఈ జంట మెస్మరైజ్ చేశారు. షోలో ప్రపోజ్ చేసుకోవడం, రింగులు మార్చుకోవడం చేశారు. రష్మీ – సుధీర్ పెళ్లి అంటూ స్పెషల్ ఈవెంట్స్ కూడా జరిగాయి.
ఇదంతా షో టీఆర్పి కోసం చేసినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ జంటకు కనెక్ట్ అయ్యారు. అయితే కొంతకాలంగా సుధీర్ సినిమాలతో బిజీ కావడంతో ఈ లవ్ ట్రాక్ కి బ్రేక్ పడింది.సుడిగాలి సుధీర్ సుధీర్ జబర్దస్త్ మానేశాడు. చెప్పాలంటే అతడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేశాడు. దీంతో రష్మీ ఒంటరి అయ్యింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులు చూసి చాలా కాలం అవుతుంది.
ఇక సుడిగాలి సుధీర్ ని మర్చిపోయినట్టే రష్మీ ప్రవర్తిస్తుంది. అయితే కమెడియన్ ఆటో రాంప్రసాద్ పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తూ రష్మీని ఆడేసుకున్నాడు. పుండు పై కారం చల్లినట్లు అయింది రష్మీ పరిస్థితి. పాపం రష్మీ నోట మాట రాక చూస్తూ ఉండిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే .. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈసారి రైల్వే ట్రాక్ కి సంబంధించిన స్కిట్ చేశారు. ట్రైన్ రావడం ఆలస్యం కావడంతో ఎంటర్టైన్మెంట్ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిచారు.
రష్మీ, ఇంద్రజను ఆహ్వానించారు. రైల్వే ట్రాక్ పై ఎంటర్టైన్ చేయడం నావల్ల కాదని రష్మీ అంటుంది. ఈ పట్టలేంటి .. ట్రైన్ ఏంటి. ట్రాక్ ఏంటి నేను ఈ ట్రాక్ పై నిల్చో లేను అని…. రష్మీ అసహనం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో రాంప్రసాద్ ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. అమ్మా మర్చిపోయావా తొమ్మిదేళ్లు నువ్వు ఒకే ట్రాక్ నడిపించావు. ఇప్పుడు రెండు గంటలు కూడా ఉండలేవా అంటూ పంచ్ వేశాడు. దీంతో రష్మీ నోరు వెళ్ళబెట్టింది. ఏం మాట్లాడాలో తెలియక చూస్తూ ఉండిపోయింది.