https://oktelugu.com/

Telangana BJP : టీ-బీజేపీ ఇంత చిన్న లాజిక్ ను ఎలా మిస్సైంది.?

ఒక వేళ ఈ నినాదాన్ని కనుక ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పబ్లిక్ లోకి తీసుకెళ్ళగల్గి ఉంటే భాజపాకు మరింతగా ఓటు బ్యాంక్ పెరిగేదని చెబుతున్నారు. ఇంత చిన్న లాజిక్ ను టీ-బీజేపీ నేతలు ఎందుకు మిస్ అయ్యారో తెలియడం లేదంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 20, 2024 / 06:58 PM IST

    Telangana BJP

    Follow us on

    Telangana BJP : తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభావం అనూహ్యంగా తగ్గింది. అదే టైంలో కాంగ్రెస్,బిజెపిలు బాగా పుంజుకున్నాయి. కాంగ్రెస్కు రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఎంపి సీట్లు రావొచ్చని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. బిజెపి కూడా మంచి సీట్లనే గెలుచుకుంటుందని చెబుతున్నాయి. అయితే బీఆర్ఎస్ ఇంతలా వీక్ అయ్యిన నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ మరింతగా పుంజుకునేందుకు అవకాశాలు ఉండేవనే అభిప్రాయమూ వ్యక్తమవుతుంది. ఆ లాజిక్ ను టీ-బీజేపీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అంతగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్ కు దిక్కు లేదు.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదు. ఈసారి దేశ వ్యాప్తంగా మోడీ హవా కొనసాగింది. ఆయన చరిష్మా వల్లే దేశ వ్యాప్తంగా మరోసారి బీజేపీ ప్రభంజనం కనిపించింది. అందులో భాగంగానే మోడీ హవా తెలంగాణలో స్పష్టంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కనిపించింది. రాష్ట్రంలో పట్టులేని చాలా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపుపై ఆశలు పెరిగాయి. అయితే ఇంతటి అనుకూల పరిస్థితులను టీ-బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోనట్లు అనిపిస్తోంది.

    కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు లోక్ సభ సీట్లే కీలకమనేది తెలిసిన విషయమే. అయితే ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవు. బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ ఎంపీ స్థానాలను గెలుచున్నా..ప్రయోజనమేమీ లేదు. ఇదే ఫార్ములాను టీ-బీజేపీ ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేంద్రంలో పవర్ లోకి వచ్చే ఛాన్స్ లేని కాంగ్రెస్ కు ఓటేసినా..రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ కు ఓటేసినా..ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదనే క్యాంపెయినింగ్ ను కాషాయ నేతలు విసృతంగా చేయలేకపోయారని అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఈ నినాదాన్ని కనుక ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పబ్లిక్ లోకి తీసుకెళ్ళగల్గి ఉంటే భాజపాకు మరింతగా ఓటు బ్యాంక్ పెరిగేదని చెబుతున్నారు. ఇంత చిన్న లాజిక్ ను టీ-బీజేపీ నేతలు ఎందుకు మిస్ అయ్యారో తెలియడం లేదంటున్నారు.