రేపటి నుంచే పంచాయతీ నామినేషన్లు.. స్వీకరించమంటున్న ఉద్యోగులు..

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులతోనే పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రిక ప్రారంభం అవుతుంది. అయితే దీనికి సర్కారు సహకరించపోవడం.. ఉద్యోగుల గైర్హాజరుతో అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా.? లేదా అన్నది ఉత్కంఠగా మారింది. Also Read: ఆ కేసు కూడా పెట్టేసిన ఏపీ పోలీసులు? నిమ్మగడ్డ రమేశ్ బాబుకు […]

Written By: Srinivas, Updated On : January 24, 2021 1:13 pm
Follow us on


ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులతోనే పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రిక ప్రారంభం అవుతుంది. అయితే దీనికి సర్కారు సహకరించపోవడం.. ఉద్యోగుల గైర్హాజరుతో అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా.? లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

Also Read: ఆ కేసు కూడా పెట్టేసిన ఏపీ పోలీసులు?

నిమ్మగడ్డ రమేశ్ బాబుకు ఏపీ ఉద్యోగులు షాకుల మీదషాకులు ఇస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్, డీజీపీ, పంచాయతీ కార్యదర్శులు హాజరు కాకుండా ఝలక్ ఇచ్చారు. ఇక పంచాయతీ ఎన్నికల విషయమై సుప్రీం కోర్టు ఏం చేస్తుందన్న దానిపై ఏపీ ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ఎన్నికలకు సుప్రీం బ్రేక్ వేస్తుందనే దీమాతో ఉంది. అయితే బ్రేక్ పడకపోతే.. ఏం చేయాలనే దానిపై జగన్ సర్కారు మల్లగుల్లాలు పడుతోంది.

Also Read: రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయ కత్తులు.?

నిమ్మగడ్డ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఏపీలో రేపటి నుంచి మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఏపీ అధికార యంత్రాంగం మొత్తం నిమ్మగడ్డకు సహకరించడం లేదు. దీంతో ఎన్నికల నిర్వహణపై అనుమానం నెలకొంది. అయితే సుప్రీం కోర్టు ఏం చెప్పినా.. సిద్ధమని నిమ్మగడ్డ ప్రకటించారు. ఈ క్రమంలో సుప్రీం తీర్పు.. తరువాత ఏపీలో ఏం జరుగుతుందనే టెన్షన్ నెలకొంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్