https://oktelugu.com/

గూగుల్ లో రోజంతా వాటిగురించే సెర్చింగ్…

ఏపీలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలపై కేంద్రసర్కారు జోక్యం చేసుకుంటుందా..? ఒకవేళ అదే జరిగితే.. తరువాతి పరిణామాలు ఎటు దారితీస్తాయి..? ఇప్పటి వరకు ఇటాంటి పరిణామం ఎక్కడైనా జరిగిందా..? జరిగితే.. ఎలాంటి పరిష్కారం దొరికింది.. .? ఇదీ శనివారం మధ్యహ్నం నుంచి పొద్దుపోయే వరకు గుగూల్ లో జరిగిన భారీ సెర్చ్.. Also Read: ఆ కేసు కూడా పెట్టేసిన ఏపీ పోలీసులు? ఏపీలో ఏర్పడిన పరిణామాలపై మేధావుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతీ ఒక్కరు ఆసక్తి చూపారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 24, 2021 / 01:05 PM IST
    Follow us on


    ఏపీలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలపై కేంద్రసర్కారు జోక్యం చేసుకుంటుందా..? ఒకవేళ అదే జరిగితే.. తరువాతి పరిణామాలు ఎటు దారితీస్తాయి..? ఇప్పటి వరకు ఇటాంటి పరిణామం ఎక్కడైనా జరిగిందా..? జరిగితే.. ఎలాంటి పరిష్కారం దొరికింది.. .? ఇదీ శనివారం మధ్యహ్నం నుంచి పొద్దుపోయే వరకు గుగూల్ లో జరిగిన భారీ సెర్చ్..

    Also Read: ఆ కేసు కూడా పెట్టేసిన ఏపీ పోలీసులు?

    ఏపీలో ఏర్పడిన పరిణామాలపై మేధావుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతీ ఒక్కరు ఆసక్తి చూపారు. అసలు ఇలాంటి పరిణామాలు ఎక్కడైనా జరిగియా అంటూ వెతుకులాడారు. ఎక్కువ మంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 234కే గురించి. ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాని.. విధులు, బాధ్యతలు.. అధికారాలను తెలియజేస్తుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించబోమని చెబుతోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఎస్ఈసీ చెబుతున్నారు. ఈ క్రమంలో నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దీంతో శనివారం ఎవరినోట విన్నా.. రాజ్యంగంలోని ఆర్టికల్ 234కే గురించే చర్చ జరిగింది.

    Also Read: రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయ కత్తులు.?

    తరువాత రాజ్యాంగంలోని 73, 74 ఆర్టికల్స్ సవరణ గురించి ఎక్కువ మంది శోధించారు. ఇవి రెండు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సబంధించివి. ఈ రెండింటితో పాటు ప్రభుత్వం విధులు.. గవర్నర్ విధుల గురించి కూడా ఎక్కువ మంది శోధించారు. అదే విధంగా ఇలాంటి పరిస్థితి.. దేశంలో ఎక్కడైనా వచ్చిందా..? వస్తే.. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు..? అనే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. మరో వైపు ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే.. అనే ప్రశ్నలను ప్రతీ ఒక్కరూ సంధించారు. ఇలా శనివారం అంతా గుగూల్ వినియోగంలో సరికొత్త ట్రెండ్ నెలకొంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్