కరోనా తరువాత.. భారత గడ్డపై సమరానికి రెడీ..

కరోనా వైరస్ అనంతరం సుదీర్ఘ విరామం తరువాత భారత గడ్డపై తొలి క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్.. ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 5నుంచి జరిగే టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో ఇరు జట్ల ఆటగాళ్లకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత ఆటగాళ్లు.. వివిధ సిటీల నుంచి జవవరి 27 చెన్నైకి చేరుకోనున్నారు. అక్కడికి వచ్చిన వెంటనే బయో బబుల్ లోకి ప్రవేశించి.. వారంరోజులు […]

Written By: Srinivas, Updated On : January 24, 2021 1:23 pm
Follow us on


కరోనా వైరస్ అనంతరం సుదీర్ఘ విరామం తరువాత భారత గడ్డపై తొలి క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్.. ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 5నుంచి జరిగే టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో ఇరు జట్ల ఆటగాళ్లకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత ఆటగాళ్లు.. వివిధ సిటీల నుంచి జవవరి 27 చెన్నైకి చేరుకోనున్నారు. అక్కడికి వచ్చిన వెంటనే బయో బబుల్ లోకి ప్రవేశించి.. వారంరోజులు క్వారంటైన్ పాటిస్తారు. టీమిండియా.. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ న్యూజిలాండ్ నుంచి చెన్నైకి చేరుకుని ఇప్పటికే హోటల్లో ఓ ప్రత్యేక గదిలోకి వెళ్లిపోయారు.

Also Read: ఆస్ట్రేలియా పర్యటనకు ముందు జరిగిన సంఘటనపై రవిశాస్త్రీ..

ఇంగ్లాండ్ టీం మాత్రం . శ్రీలంకతో సిరీస్ తరువాత కొలంబో నుంచి ఈనెల 27న ఇక్కడికి చేరుకుని హోటల్ లోకి ప్రవేశిస్తారు. ఇప్పటికే బయోబబుల్లో ఉన్నవీరు చార్టెడ్ ప్లయిట్ ద్వారా రానున్నారు. అయితే శ్రీలంక సిరీస్ ఆడని ముగ్గురు ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. బెన్ స్టోక్, జోఫ్రా అర్చర్, రోరీ బర్న్స ఆదివారం ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. వారికి అక్కడే కోవిడ్ 19 పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ గా తేలిన తరువాత చెన్నైకి బయలుదేరుతారు. వీరు సహచరులతో కలవకుండా ప్రత్యేకంగా క్వారంటైన్లో ఉంటారు.

Also Read: క్రికెట్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన బీసీసీఐ.. తీవ్ర నిరాశ

ఫిబ్రవరి 5నుంచి, 13 నుంచి ఇక్కడి చిదంబరం స్టేడియంలో తొలి రెండు టెస్టులు జరుగుతాయి. క్రికెటర్లకకు సహకారం అందించేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్న లైజన్ మేనేజరుల, గ్రౌండ్స్ మన్ , డైవర్ తదితర.. సుమారు 15 మంది బయోబబుల్లో ఉంటారు. కొందరు అసోసియేషన్ అధికారులను కూడా బయోబుబల్లో ఉంచాలని ముందుగా భావించినా.. నిర్వహణ ఏర్పాట్లలో సమస్యలు వస్తాయని.. పక్కన పెట్టారు. వీరెవ్వరూ.. మ్యాచ్ సమయాల్లో ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూముల సమీపంలోకి రాకూడదని ఆంక్షలు విధించారు.