https://oktelugu.com/

Vanama Raghava Issue: ఈటలకు అలా.. ‘వనమా’కు ఇలా..కేసీఆర్ ది ధృతరాష్ట్ర తీరేనా?

Vanama Raghava Issue: వడ్డించే వాడు మనవాడైతే ఏ మూల కూర్చున్నా ఒక ముక్క ఎక్కువే దొరుకుతుందంటారు.. మనవాడైతే చాలు వాడు ఎన్ని తప్పులు చేసినా మనకు కనపడవంతే.. కౌరవులు ఎన్ని తప్పులు చేసినా ధృతరాష్ట్రుడు చూసి ఊరుకున్నట్టు.. ఇప్పుడు తెలంగాణ సర్కార్ లోనూ కేసీఆర్ ధృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తున్నాడన్న విమర్శలు ప్రత్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ రైతుల కోరిక మేరకు వారికి డబ్బులిచ్చి మరీ భూములు కొంటే.. అవి అసైన్డ్ భూములని […]

Written By:
  • NARESH
  • , Updated On : January 6, 2022 4:26 pm
    Follow us on

    Vanama Raghava Issue: వడ్డించే వాడు మనవాడైతే ఏ మూల కూర్చున్నా ఒక ముక్క ఎక్కువే దొరుకుతుందంటారు.. మనవాడైతే చాలు వాడు ఎన్ని తప్పులు చేసినా మనకు కనపడవంతే.. కౌరవులు ఎన్ని తప్పులు చేసినా ధృతరాష్ట్రుడు చూసి ఊరుకున్నట్టు.. ఇప్పుడు తెలంగాణ సర్కార్ లోనూ కేసీఆర్ ధృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తున్నాడన్న విమర్శలు ప్రత్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి.

    మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ రైతుల కోరిక మేరకు వారికి డబ్బులిచ్చి మరీ భూములు కొంటే.. అవి అసైన్డ్ భూములని ఆయనపై అవినీతి ముద్రవేసి మంత్రి పదవి నుంచి తొలగించారు. ఈటల రాజేందర్ ఎంతటి ఉద్యమకారుడో.. ఎంతగా ప్రజల్లో కలిసిపోతారో.. ఎలాంటి నేతనో అందరికీ తెలుసు. అందుకే కేసీఆర్ పాచిక పారలేదు. హుజూరాబాద్ లో ఈటల చేతిలో కేసీఆర్ కు శృంగభంగం ఎదురైంది.

    అయితే ఈటల రాజేందర్ కేవలం తనను ఎదురించాడన్న కక్షతోనే కేసీఆర్ పార్టీ నుంచి సాగనంపాడని గుసగుసలున్నాయి. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి అప్పట్లో ఓ లేడీతో కలిసి పట్టుబడినా.. ఆయన మైనింగ్ దందా వెలుగుచూసినా కూడా కేసీఆర్ అవేమీ పట్టించుకోకుండా మంత్రి పదవిలో కొనసాగిస్తున్నాడన్న విమర్శలున్నాయి. అయిన వారికి కంచంలో.. కాని వారికి విస్తరాకుల్లో కేసీఆర్ పెడుతున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

    అయితే తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విషయంలో కేసీఆర్ తీరు చూసి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కొత్తగూడేం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు ఓ దంపతుల ఆత్మహత్యకు కారణమైతే ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఈటలరాజేందర్ కు ఒక న్యాయం.. కొత్తగూడెం ఎమ్మెల్యేకు మరో న్యాయమా అని నిలదీశారు.

    పాల్వంచలో నాగరామకృష్ణ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలకు నిప్పు పెట్టి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలంగాణ వ్యాప్తంగా పెనుదుమారం రేపుతోంది. కొత్తగూడెం ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్ర తన భార్యను పంపమన్నాడని.. ఆయన వల్లే తాను కుటుంబంతో ఆత్మహత్యకు పాల్పడ్డానని స్వయంగా నాగరామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అది బయటపడడంతో ఇప్పుడు కలకలం రేపుతోంది.

    ఈటల రాజేందర్ భూముల ఆక్రమణలు అనగానే ఆగమేఘాలపై స్పందించిన కేసీఆర్.. ఇప్పుడు తన పార్టీకే చెందిన ఎమ్మెల్యే వనమా కుమారుడిపై ఇన్ని ఆధారాలు ఉన్నాక కూడా ఎందుకు స్పందించడం లేదని ప్రతిపక్షాలు, నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

    ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి కామ దాహనానికి ఓ కుటుంబం బలైనా కూడా కేసీఆర్ నోరు మెదపడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. దంపతులు ఆత్మహత్య చేసుకొని 3 రోజులైనా చర్యలు తీసుకోలేని వైనాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మరి దీనిపై టీఆర్ఎస్ నుంచి సమాధానం రావాల్సి ఉంది.

    *వనమా రాఘవపై ఆరోపణలు ఎన్నో..
    కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా రాఘవపై ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు అధికార టీఆర్ఎస్ చేరాక.. ఆయన కుమారుడు రాఘవేందర్ అరాచకాలకు హద్దులేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. గతంలో పాల్వంచ ఎస్ఐ, ఆ తర్వాత మలిపెద్ది వెంకటేశ్వర్లు, ఇప్పుడు రామకృష్ణ ఎపిసోడ్ లో రాఘవేందర్ హస్తం ఉందని ఆరోపణలున్నాయి. తాజాగా రాఘవేందరే చేశాడని బాధితుడు సెల్ఫీ వీడియో తీసుకోవడంతో సాక్ష్యాలు లభించి బుక్కయ్యాడు.కానీ గతంలో ఎన్నో కేసుల్లో అధికార బలంతో తప్పించుకున్నాడన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న రాఘవేందర్ ను పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.