https://oktelugu.com/

AP Politics in 2022: కొత్త ఏడాదిలో ఏపీ రాజకీయం ఎలా మారనుంది..?

AP Politics in 2022: ఏపీ రాజకీయం కొత్త ఏడాదిలో మరింత వేడి పుట్టించేలా ఉంది. విధ్వంస పాలనంటూ జగన్ సర్కార్‌పై చంద్రబాబు ఫైర్ అవుతుంటే.. బీజేపీ తన సిద్ధాంతాలకు అనుగుణంగా మత రాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఓ విషయంలో ప్రతిపక్షాలు ప్రశ్నించడానికి వీలులేకుండా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ ప్రజా సమస్యలపై ఎంతలా పోరాడినా ప్రభుత్వం ఆ విషయంలో పక్కాగా ఉండడంతో ఆ పార్టీలకు […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 6, 2022 / 04:19 PM IST
    Follow us on

    AP Politics in 2022: ఏపీ రాజకీయం కొత్త ఏడాదిలో మరింత వేడి పుట్టించేలా ఉంది. విధ్వంస పాలనంటూ జగన్ సర్కార్‌పై చంద్రబాబు ఫైర్ అవుతుంటే.. బీజేపీ తన సిద్ధాంతాలకు అనుగుణంగా మత రాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఓ విషయంలో ప్రతిపక్షాలు ప్రశ్నించడానికి వీలులేకుండా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ ప్రజా సమస్యలపై ఎంతలా పోరాడినా ప్రభుత్వం ఆ విషయంలో పక్కాగా ఉండడంతో ఆ పార్టీలకు పట్టు దక్కడం లేదు.

    AP Politics in 2022

    గత రెండున్నరేళ్లలో జగన్ సర్కార్‌పై టీడీపీ పలు ఆరోపణలు చేస్తోంది. జగన్ అధికారం చేపట్టిన రోజు నుంచే విధ్వంస పాలన సాగిస్తున్నాడని మీడియాతో మాట్లాడిన ప్రతిసారి చంద్రబాబు చెప్పే మాట ఇది. అయినా టీడీపీకి ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదు. దీంతో ఈ కొత్త ఏడాది నుంచి చంద్రబాబు తన పంథా మార్చుకుంటున్నట్లు సమాచారం. గతంలో మాదిరి ఓవర్గం మీడియా, కొంత మందిని నమ్ముకోకుండా జనంలోకి వెళ్లాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఒక పక్క ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తూనే మరోపక్క క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతంపై చంద్రబాబు దృష్టిసారించనున్నారు.

    ఇక బీజేపీ విషయానికి వస్తే.. ప్రధానంగా మత రాజకీయాలపై ఫోకస్ ఎక్కువగా చేస్తుంది. గతంలో దేవాలయాలపై డాడులను హైలెట్ చేస్తే.. తాజాగా జిన్నా టవర్‌పై ఆ పార్టీ దృష్టిసారించింది. జిన్నా టవర్ పేరు మార్చకపోతే.. దాన్ని కూల్చేస్తామని ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో మతపరమైన విషయాల్లో జగన్ సర్కార్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏమాత్రం తేడా వచ్చినా పరిస్థితి ఉద్రిక్తతంగా మారే అవకాశం ఉంది.

    Also Read: ఆయనెవరో నాకు తెలీదు.. మంత్రి కొడాలి నానిపై వర్మ వ్యంగ్యాస్త్రాలు

    ఇలా ప్రభుత్వ విధానాలు, పథకాల అమలు తీరులో లోపాలపై ప్రతిపక్షాలు ఎన్ని నిరసనలు చేసినా.. ఆ ఒక్క విషయంలో మాత్రం జగన్ సర్కార్‌ను పల్లెత్తు మాట అనటానికి కూడా సాహసించలేకపోతున్నాయి. అదేనండీ అవినీతి విషయంలో. ప్రతిపక్షాలు ఇప్పటి వరకు అవినీతి భారీగా జరిగిందని ప్రభుత్వంపై విమర్శలు చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల రూపాయాలను సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తున్నా.. అవి నేరుగా లబ్ధిదారుల అకౌంట్స్‌లో జమ కావడం, మరోపక్క ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరుచూ దాడులు చేస్తుడడంతో ప్రభుత్వం జాగ్రత్త వహిస్తోంది. దీంతో అవినీతి విషయంలో జగన్ సర్కార్‌‌కు క్లీన్‌చిట్ ఇవ్వాల్సిన పరిస్థితి ప్రతిపక్షాలకు ఏర్పడింది.

    ఏపీలో విపక్షాలు ప్రభుత్వ విధానాలనో, వివాదాస్పద అంశాలనో, పథకాల్లో లోపాలనో తెరపైకి తెచ్చి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా వారికి పట్టు చిక్కడం లేదు. గతంలో అవినీతి పేరుతో జగన్ తండ్రి వైఎస్ ను, ఆయన మరణం తర్వాత జగన్ ను కూడా టార్గెట్ చేసి జైలుకు పంపిన విపక్షాలు.. ఇప్పుడు మాత్రం ఆ అంశాన్ని ప్రస్తావించేందుకు సైతం సాహసించడం లేదు. దీనికి కారణం ఎక్కడా అవకాశం దక్కకపోవడమే. ప్రభుత్వం ఏడాదికి దాదాపు లక్ష కోట్లను పథకాల రూపంలో పంచుతున్నా అందులో అవినీతి ఉందని చెప్పేందుకు విపక్షం సాహసించకపోవడం కచ్చితంగా జగన్ సర్కార్ కు భారీ ఊరటనిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలు కొరడా ఝళిపిస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఆ విషయంలో మాత్రం విపక్షాలు జగన్ కు క్లీన్ చిట్ ఇవ్వక తప్పడం లేదు.

    మొత్తంగా 2021తో పోల్చితే 2022లో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఎన్నికలకు ఈ ఏడాది కాకుండా మరో ఏడాది మాత్రమే ఉండడంతో ఏం చేసినా ఈ ఏడాదియే. అందుకే అన్ని పార్టీలు రాజకీయ రణరంగాన్ని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

    Also Read: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతి కేంద్రంగా నయా పాలిటిక్స్!

    Tags