Nagababu for North Andhra: ఏ పార్టీ అయినా రాజకీయంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది. అది సహజ ప్రక్రియ కూడా. ఇప్పుడు జనసేన కూడా అదే ప్రయత్నంలో ఉంది. కూటమిగా ఉంటూనే అభివృద్ధి కావాలని చూస్తోంది. అన్ని ప్రాంతాల్లో ప్రాతినిధ్యం కోరుకుంటుంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పార్టీ బలపడాలన్న లక్ష్యంతో ఉన్నారు పవన్ కళ్యాణ్. అందుకే పార్టీలో ఉన్న కమిటీలను రద్దు చేశారు. ఎక్కడికక్కడే 5 మెన్ కమిటీ అందుబాటులోకి తేనున్నారు. వాట్ డు ఇన్చార్జ్ నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు సమూల మార్పులు తీసుకొచ్చే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే పార్టీలో బాధ్యతలని రామ్ తాళ్లూరికి అప్పగించారు. ఇప్పుడు ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ కార్యవర్గాలను నియమించే పనిలో పడ్డారు పార్టీ నాయకత్వం సూచనతో. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు ఎవరు? పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు ఎవరు? అనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. ఆది నుంచి పార్టీలో ఉన్నవారికి ఎనలేని ప్రాధాన్యమిస్తూ.. కొత్త వారిని సైతం కలుపు కెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పాత, కొత్త నాయకులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.
నాలుగు రీజియన్లపై ఫోకస్..
రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలను.. రీజియన్లుగా విభజించి రాజకీయం చేయాలనుకుంటోంది జనసేన. అయితే ఈ నాలుగు ప్రాంతాల్లో గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉంది. అక్కడ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆ ప్రభావం గోదావరి జిల్లాలపై ఉండనుంది. అయితే ఆ తరువాత జనసేనకు అత్యంత బలంగా భావించే రీజియన్ ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో బీసీ సామాజిక వర్గం అధికం. ప్రధానంగా కాపు, తూర్పు కాపు సామాజిక వర్గాలు సైతం ఉన్నాయి. ఆపై మత్స్యకారులతో పాటు బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి. అక్కడ జనసేన విస్తరించడం చాలా సులువు. అందుకే ఉత్తరాంధ్ర బాధ్యతలను ఎమ్మెల్సీ నాగబాబుకు అప్పగించారు పవన్ కళ్యాణ్. ఆయన తరచూ పర్యటనలు చేస్తున్నారు. మూడు జిల్లాల్లో నిత్య సుదర్శన ద్వారా పార్టీ శ్రేణులను కలుస్తున్నారు.
రెట్టింపు సీట్లపై..
ఉత్తరాంధ్రలో( North Andhra ) మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10, విజయనగరం జిల్లాలో 9, విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు కొనసాగుతున్నాయి. ఐదు పార్లమెంటు సీట్లు సైతం ఉన్నాయి. గడిచిన ఎన్నికల్లో కూటమి ఇక్కడ 32 సీట్లలో విజయం సాధించింది. టిడిపి తర్వాత అతిపెద్ద పార్టీ జనసేన ఇక్కడ. ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి ఆరు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి డబ్బులు సీట్లు పొందాలన్నది పవన్ కళ్యాణ్ ప్లాన్. అంటే ఇప్పుడు ఉన్న ఆరు స్థానాలకు మరో ఆరు స్థానాలు.. అంటే 12 స్థానాలు అన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ ఈ బాధ్యతలను నాగబాబుకు అప్పగించారు. అందుకే నాగబాబు ఉత్తరాంధ్రలో నిత్య పర్యటనలు చేస్తున్నారు. శ్రీకాకుళంలో ఇప్పుడున్న ఒక స్థానానికి తోడు మరో రెండు.. విజయనగరంలో ఇప్పుడున్న స్థానానికి తోడు మరో రెండు.. విశాఖలో ఇప్పుడున్న నాలుగు స్థానాలకు మరో రెండు తోడు అన్నట్టు జనసేన ప్రణాళిక ఉంది. మరి అది అంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.