Chandrababu Plan: గ్రామ స్వపరిపాలనే లక్ష్యంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు గతంలో సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఈ వ్యవస్థపై మొదట్లో తీవ్ర విమర్శలు చేసింది టీడీపీ. వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలనే నియమించారని ఆరోపణలు గుప్పించింది. ఎన్నికల సమయంలో వాలంటీర్లను వినియోగించుకోకూడదని ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పార్టీ నాయకులతో సమావేశమైనప్పుడు చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికలు టీడీపీకి డూ ఆర్ డై లాంటివి. ఈసారి పార్టీ గెలవకపోతే టీడీపీ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీంతో ఢీ అంటే ఢీ అనే విధంగా ఉండే అభ్యర్థులను రంగంలోకి దించాలని చంద్రబాబు భావిస్తు్న్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
Also Read: జగన్ ను ఓడించడానికి చంద్రబాబు వేసిన ప్లాన్ ఇదే..
వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. గ్రామ, వార్డు, మండల, క్లస్టర్, బూత్ కమిటీలను ఈనెల 15లో నియమించాలని నేతలను ఆదేశించారు. బూత్ లెవల్ లో ప్రతి వంద మంది ఓటర్లను పర్యవేక్షించేందుకు పార్టీ కార్యకర్తను నియమించుకోవాలని నేతలకు సూచించారు.
టీడీపీ అధికారంలోకి వస్తే వారినే వాలంటీర్లుగా నియమిస్తామని చంద్రబాబు చెప్పారు. దీంతో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయించటంలో వారు కీలక పాత్ర పోషించేలా పార్టీ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఒకవైపు ప్రభుత్వ వాలంటీర్లు, మరో వైపు టీడీపీ వాలంటీర్లు క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయనున్నారు. కాగా, ఇప్పటికే వార్డు, సచివాలయ సిబ్బంది ప్రొబేషనరీ సమయం పూర్తి చేసుకున్నారు. దీంతో పర్మనెంట్ కోసం వారు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ.
Also Read: ఆ న్యూస్ చానెళ్లకు తొలిసారి భయపడుతున్న చంద్రబాబు.. అసలు కారణం ఇదే?