https://oktelugu.com/

Pakistan- Turkey: పాక్ దివాళా..భారత్ మీద సరికొత్త కుట్రలు

ర్కీని ఆహ్వానించే విషయంలోనే కాదు గతంలోనూ అంటే 2005లో భారత్ కు వ్యతిరేకంగా పాక్ అమెరికాతో చెలిమి చేసింది. అంతర్జాతీయంగా అప్పులు చేసింది. అభివృద్ధి అనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి అప్పులు తెచ్చింది.

Written By:
  • Rocky
  • , Updated On : August 5, 2023 / 04:10 PM IST

    Pakistan- Turkey

    Follow us on

    Pakistan- Turkey: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటామని మొన్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన వేసిన అడుగులు మొత్తం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకునే దిశగానే పడ్డాయి. ఈ ప్రయాణంలో అనేక చిక్కులు ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క అవరోధాన్ని తొలగించుకుంటూ వెళ్తున్నారు. అయితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ స్వాధీనం చేసుకోగలదా? అది అంత సులభమా? లేకుంటే కష్టమా? మధ్యలో పాకిస్తాన్ ఎటువంటి కుట్రలకు తెరలేపుతోంది? టర్కీ సహాయాన్ని ఎందుకు కోరుతోంది?

    ఏ ముహూర్తాన మన నుంచి విడి పోయిందో.. అప్పటినుంచి పాకిస్తాన్ విషం చిమ్ముతూనే ఉంది. ఏదో ఒక రూపంలో భారతదేశాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. దాని ఉగ్రవాద రూపంలో దివాళా అంచులోకి వెళ్లిపోయినప్పటికీ.. భారత్ మీద కుట్రలు చేయడం మాత్రం మానడం లేదు. విదేశీ కంపెనీలు వెళ్లిపోతున్నప్పటికీ, గోధుమ పిండి కోసం జనాలు కొట్టుకు చస్తున్నప్పటికీ అవేవీ పాకిస్తాన్ దేశాన్ని మార్చడం లేదు. అటువంటి అనుభవాల నుంచి పాకిస్తాన్ పాఠాలు నేర్చుకోవడం లేదు. సరి కదా భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు రకరకాల కుయుక్తులు పన్నుతోంది. ఇటువంటివే ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

    అప్పట్లో పాకిస్తాన్ కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించింది. దానికి పిఓకే అని పేరు పెట్టింది. అప్పట్లో డబ్బులు లేకపోవడంతో చైనా సహకారం కోరింది. చైనా ప్రతిఫలం ఆశించడంతో తాను ఆక్రమించిన భూమిలో పాకిస్తాన్ చైనా ఎకనామిక్స్ కారిడార్ ఏర్పాటు చేసింది. ఈ కారిడార్ లో పేరుకు పాకిస్తాన్ ఉన్నప్పటికీ పెత్తనం మొత్తం చైనాదే. చైనా కూడా ఈమధ్య పాకిస్తాన్ దేశాన్ని సరిగా నమ్మడం లేదు. దీంతో పాకిస్తాన్ సరికొత్త ఎత్తుగడకు తెర లేపింది. తాను ఆక్రమించిన కాశ్మీర్ భూభాగంలో పెట్టుబడులు పెట్టాలని టర్కీ దేశాన్ని తాజాగా ఆహ్వానించింది. టర్కీ కూడా ముస్లిం దేశం కాబట్టి.. ఆ దేశం ఇచ్చే నిధులతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాలని పాకిస్తాన్ ప్లాన్. అయితే రేపటి నాడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ స్వాధీనం చేసుకుంటే.. అప్పుడు ఇటు చైనా, అటు టర్కీ దేశాలు రంగం మీదికి వస్తాయి. పాకిస్తాన్ తెలివిగా తప్పించుకుంటుంది. అప్పుడు భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఒకవేళ స్వాధీనం చేసుకోవాలి అనుకుంటే అది చైనా, టర్కీ దేశాలతో పోరాడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత యుద్ధం చేయడం సాధ్యమవుతుందా అనేది ఒకింత సందేహమే. ఎందుకంటే భారత్ కంటే చైనా ఆర్థికంగా చాలా బలమైనది. టర్కీ దేశానికి ముస్లిం దేశాల సపోర్ట్ ఉంటుంది. ఈ ప్రకారం భారత్ ఒంటరిది అయిపోతుంది..

    టర్కీని ఆహ్వానించే విషయంలోనే కాదు గతంలోనూ అంటే 2005లో భారత్ కు వ్యతిరేకంగా పాక్ అమెరికాతో చెలిమి చేసింది. అంతర్జాతీయంగా అప్పులు చేసింది. అభివృద్ధి అనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి అప్పులు తెచ్చింది. అయితే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాకిస్తాన్ పన్నాగాన్ని అంతర్జాతీయ సమాజం ముందు ఉంచారు. అన్నింటికీ మించి అమెరికా అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు అర్థమయ్యేలా చెప్పారు. ఫలితంగా పాక్ దేశానికి అంతర్జాతీయంగా రుణాలు రాకుండా చేశారు. ఉగ్రవాద దేశంగా ముద్ర వేసి ఎటువంటి వెసలు బాట్లు కలగకుండా కట్టడి చేశారు. దీంతో పాకిస్తాన్ ఇబ్బంది పడింది. జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత పాకిస్తాన్ దేశానికి అంతర్జాతీయంగా రుణాలు అందేలాగా చేశారు. పాకిస్తాన్ దేశంతో రహస్యంగా స్నేహం సాగిస్తున్నారు. అటు చైనా కూడా అంతే. టర్కీ కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో విలువైన వనరులను తమ దేశానికి తరలించే ప్లాన్లో ఉంది. పెట్టుబడులకు సంబంధించి అటు టర్కీ ఇటు పాకిస్తాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అనుకున్నట్టు జరిగితే ఏదో ఒక రోజు టర్కీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో వాలిపోవడం ఖాయం. మరి దీనిపై మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, మనతో స్నేహం నటిస్తూ పాకిస్తాన్ కు సహాయం చేస్తున్న అమెరికా, చైనా, టర్కీ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.