Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో జరగబోయేది బెంగాల్ లాంటి ఎన్నికలా?

ఈ శిక్షణ శిబిరంలో పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైన పాయింట్ ను ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు. బెంగాల్ తరహా ఎన్నికలు జరుగబోతున్నాయి. హింసతో కూడిన ఎన్నికలు. మమతా బెనర్జీ బెంగాల్ లో హింసతో గెలుస్తున్నారు. ఆ మోడల్ ను జగన్ ఏపీలో తీసుకొస్తున్నాడని పవన్ చెప్పకనే చెప్పాడు.

Written By: NARESH, Updated On : August 5, 2023 4:06 pm
Follow us on

Pawan Kalyan : మంగళగిరిలో జనసేన సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య నాయకులు ఒకచోట కూర్చొని ఆత్మ సమీక్ష సమావేశం చేసుకున్నారు. నాయకుల శిక్షణ శిబిరంగా దీన్ని భావిస్తున్నారు. నాయకులు ఎలా ప్రవర్తించాలి. పార్టీని ఎలా అభివృద్ధి చేయాలి.. వీటి గురించి ఎక్కువ భాగం వీటిపై ఫోకస్ చేద్దాం.

నాగబాబూ చాలా మాట్లాడారు. యూరప్ టూర్ లో ఒక జనసేన వీర మహిళ మాట్లాడింది కోట్ చేశాడు. ‘ఇప్పుడు ప్రధాన స్రవంతి టీడీపీ, వైసీపీ పార్టీలు కుటుంబాల కోసం పనిచేస్తాయి. పవన్ కళ్యాణ్ మా పిల్లల కోసం పనిచేస్తున్నాడని చెప్పింది. ఆయన స్వార్థం కోసం కాకుండా వచ్చే తరం కోసం పనిచేస్తున్నాడని చెప్పిందని’ వివరించారు.

ఈ శిక్షణ శిబిరంలో పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైన పాయింట్ ను ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు. బెంగాల్ తరహా ఎన్నికలు జరుగబోతున్నాయి. హింసతో కూడిన ఎన్నికలు. మమతా బెనర్జీ బెంగాల్ లో హింసతో గెలుస్తున్నారు. ఆ మోడల్ ను జగన్ ఏపీలో తీసుకొస్తున్నాడని పవన్ చెప్పకనే చెప్పాడు.

జగన్ ఓడిపోయే పరిస్థితి వస్తే హింసకు, ఎంతకైనా తెగిస్తాడని.. పవన్ చెప్పిన సారాంశం.

ఆంధ్రప్రదేశ్ లో జరగబోయేది బెంగాల్ లాంటి ఎన్నికలా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.