Pakistan GDP : ఇవన్నీ కూడా దాయాది దేశానికి అచ్చంగా సరిపోతాయి. ఎందుకంటే అక్కడ రోడ్లు లేవు. జనాలకు సురక్షితమైన నీరు అందదు. మూడు పూటల భోజనం దొరకదు. ఇవన్నీ జరగాలంటే ఏదో ఒక దేశం అప్పు ఇవ్వాలి. నమ్మి అక్కడ పెట్టుబడి పెట్టాలి. అవన్నీ జరగాలంటే ముందు అక్కడ ఉగ్రవాదం లేకుండా పోవాలి. అక్కడ ఉగ్రవాదం పోయే పరిస్థితి లేదు. ఉగ్రవాదులు ఆదేశాన్ని విడిచి వెళ్లే అవకాశం లేదు. పొరపాటున అక్కడ ప్రభుత్వం ఆర్మీకి వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక అంతే సంగతులు. ఆ దేశ అధ్యక్షుడు జైలుకు వెళ్తాడు. కర్మ బాగా లేకపోతే కాటికి వెళ్తాడు. ఇక ప్రధానమంత్రి .. మంత్రులు కూడా అదే సత్కారాన్ని పొందుతుంటారు. గతంలో జరిగిన పరిణామాలు ఉగ్రవాద దేశ ఆర్మీ ఎంత దారుణంగా ఉంటుందో నిరూపించాయి. ప్రస్తుత పరిణామాలు కూడా దానినే నిరూపిస్తున్నాయి. అయినప్పటికీ ఆ దేశం మారదు. మారే అవకాశం లేదు. ఒకవేళ మారినప్పటికీ అక్కడి ఉగ్రవాదులు మత చాందసవాదంతో ఆ దేశాన్ని ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తారు.
Also Read : మోదీ వార్నింగ్‌పై స్పందించిన పాకిస్తాన్.. సుదీర్ఘ ప్రకటన విడుదల
మీకెందుకురా బాబూ యుద్ధాలు
ప్రత్యర్థి దేశంతో యుద్ధం చేయాలంటే సత్తా ఉండాలి. అన్నింటికీ మించి ఆర్థికంగా బలం ఉండాలి. ఆయుధ సామాగ్రి దండిగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే ఆదేశంలో పరిపాలన సక్రమంగా సాగుతూ ఉండాలి. పాకిస్తాన్ ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయింది. ఉగ్రవాదానికి భూతల స్వర్గం లాగా మారిపోయింది.. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ నరకం చూపిస్తోంది. పోనీ వాటిని సక్రమంగా ఖర్చు చేస్తోందా? అంటే లేదు. అక్కడ వసూలు చేసిన పన్నులు మొత్తం ఆర్మీ చేతిలోకి వెళ్తాయి. అవి కాస్త ఉగ్రవాదులకు చేరిపోతాయి. అంతిమంగా పన్నులు చెల్లించిన ప్రజలు మొత్తం సౌకర్యాలు లేక.. నరకం చూస్తారు. వాస్తవానికి పాకిస్తాన్ ఆదాయం ఇటీవల కాలంలో మరింత దారుణంగా పడిపోయింది. ఆ దేశ జిడిపి 397.5 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇది మనదేశంలో తమిళనాడు రాష్ట్రానికంటే తక్కువ.. తమిళనాడు రాష్ట్రం జిడిపి 419.5 బిలియన్ డాలర్లు. మనదేశంలో ఒక రాష్ట్రం స్థాయిలో కూడా జిడిపి నమోదు చేయాలని పాకిస్తాన్.. మనకు యుద్ధం చేస్తానంటూ మేకపోతు గాంభీర్యం పలుకుతోంది. చైనా ఇచ్చే చిల్లర పైసల కోసం.. ఇతర దేశాలు ఇచ్చే అప్పు కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతోంది..పోనీ తెచ్చిన అప్పును సక్రమ మార్గంలో ఖర్చు చేస్తోందా అంటే.. అది కూడా లేదు. మొత్తంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద దేశంగా పేరు.. పర్యాటకులు రావడానికి ఇష్టపడని తీరు.. చివరికి సొంత దేశ పార్లమెంట్ సభ్యులే ఛీ కొడుతున్న విధానం.. ఇదీ ఉగ్రవాద దేశ అసలు ముఖచిత్రం.. ఇది మారుతుందా.. మారే అవకాశం ఉందా.. ఈ ప్రశ్నలకు మారదు.. మారే అవకాశం లేదు అనే సమాధానాలు మాత్రమే వస్తాయి.
Also Read : నేరుగా యుద్ధం చేయలేదు గాని.. సైబర్ దాడికి దిగింది.. ఛీ ఛీ పాక్ ఇంకా ఎంతకు దిగజారుతుందో?