Hurun Rich List 2022: డబ్బుంటేనే సమాజంలో గౌరవం. డబ్బు ఉంటేనే పేరు ప్రఖ్యాతులు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచమంతా డబ్బు చుట్టే పరిభ్రమిస్తోంది. అందుకే కదా అదానీ, అంబానీ వార్తల్లో వ్యక్తులయ్యేది. మీడియా ఫోకస్ కూడా అదానీ ఎంత సంపాదించాడు? ముఖేష్ ఎన్ని ఆస్తులు కొన్నాడు? టిసిఎస్ ఎన్ని కోట్లు గడిచింది? విప్రో కొత్త విస్తరణ లక్ష్యాల ఏంటనే వాటి చుట్టే తిరుగుతుంది. వీరి స్థాయిలో కాకున్నా.. భవిష్యత్తులో వీరిని చేరుకునే లేదా అన్ని కలిసి వస్తే వీరిని అధిగమించే స్థాయిలో కొంతమంది శ్రీమంతులు ఉన్నారు. ఎంతసేపు అదాని, అంబానీ గురించే కాకుండా వీరి గురించి కూడా కొంచెం చదవండి. అన్నింటికంటే ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నులు ఎవరో కూడా తెలుసుకోండి.

అంబానీ, అదానీ కాకుండా దేశంలోని సంపన్నుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 78 మంది చోటు సంపాదించుకున్నారు ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ రిచ్ లిస్ట్ 2022 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 78 మంది చోటు దక్కించుకున్నారు. 2022లో తెలుగు రాష్ట్రాల నుంచి దివిస్ లేబరేటరీస్ కు చెందిన మురళి దివి, ఆయన కుటుంబం ప్రథమ స్థానంలో నిలిచింది. వీరి సంపద 56, 200 కోట్లుగా ఉంది.. హెటిరో ల్యాబ్ వ్యవస్థాపకుడు పార్థసారధి రెడ్డి 39,200 కోట్ల సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల 78 మంది సంపన్నుల మొత్తం సంపద 3,90,500 కోట్లుగా ఉంది. విర్కౌవ్ లాబరేటరీస్, ఎంఎస్ఎన్ లేబరేటరీస్, సింఘానియా ఫుడ్స్ ఇంటర్నేషనల్ కంపెనీల నుంచి ముగ్గురు చొప్పున ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈసారి జాబితాలో 8,700 కోట్ల సంపదతో మహిమ దాట్ల అత్యంత సంపన్నురాలైన మహిళగా నిలిచారు. కేవలం ఫార్మా వ్యాపారం నుంచే 24 మంది సంపన్నులు వచ్చారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 లో సౌత్ ఇండియాలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముందు ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి 1000 లేదా అంతకంటే ఎక్కువ కోట్ల సంపద ఉన్నవారు ఈ జాబితాలో 64 మంది హైదరాబాద్ నుంచి ఉండగా, ఐదుగురు విశాఖపట్నం నుంచి, ముగ్గురు రంగారెడ్డి నుంచి ఉన్నారు. ఫార్మా సెక్టార్ లోని శ్రీమంతుల్లో 31 శాతం మంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర నుంచి ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, వుడ్ అండ్ బేవరేజెస్, కన్స్ట్రక్షన్, కెమికల్స్ సెక్టార్ల నుంచి కూడా సంపన్నులు ఉన్నారు. ముందు రోజుల్లో ఈ జాబితాలో చాలామంది చోటు సంపాదిస్తారని ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఏపీ, తెలంగాణ రిచ్ లిస్ట్ ఫౌండర్ ఈయాటిన్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. 11 ఏళ్ల కింద ముగ్గురు మాత్రమే ఈ జాబితాలో ఉండేవారు. ప్రస్తుతం ఆ సభ్యుల సంఖ్య 26 రెట్లు పెరిగింది.
అత్యంత సంపన్నురాలిగా నైకా ఫాల్గుణి నాయర్
బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మంజుదార్ షా ను దాటి దేశంలో అత్యంత సంపన్నురాలైన మహిళగా నైకా ఫౌండర్ ఫాల్గుణి నాయర్ నిలిచారు. హురూన్ జాబితాలో మహిళా సంపన్నులు 55 మంది దాకా ఉన్నారు. పదేళ్ల క్రితం కేవలం 13 మంది మహిళా సంపన్నులు మాత్రమే ఈ జాబితాలో ఉండేవారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా జీవితాన్ని మొదలుపెట్టిన నాయర్.. సౌందర్య ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మడం ద్వారా కొత్త విప్లవానికి నాంది పలికారు. ఆమె ప్రారంభించిన స్టార్టప్ నైకా దేశంలోనే లాభాల్లో నడుస్తున్న స్టార్టప్ లలో ఒకటి. గత రెండేళ్ల నుంచి బ్యూటీ ప్రొడక్ట్లే కాకుండా ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ప్రొడక్ట్లను నైకా అమ్ముతోంది.

ప్రస్తుతం కంపెనీ పోర్ట్ఫోలియోలో 2,600 పైగా అంతర్జాతీయ బ్రాండ్లు, వందకు పైగా ఆఫ్లైన్ స్టోర్లు ఉన్నాయి.. తాజాగా ఐపీఓ ద్వారా నైకా క్యాపిటల్ నిధులను సమీకరించింది. కరోనా, ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారులు గతంతో పోల్చితే భారీగా వృద్ధిరేటును నమోదు చేయడం గమనార్హం. అయితే కరోనా సమయంలోనే దివిస్ లేబరేటరీ, హెటిరో లేబరేటరీ ఘణనీయమైన వృద్ధిరేటును సాధించాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు క్యాన్సర్ ఔషధాలపై ప్రయోగాలు చేస్తున్నాయి. ఒకవేళ వాటికి అమెరికన్ డ్రగ్ కంట్రోలర్ అథారిటీ ఓకే చెబితే ఈ కంపెనీల పంట పండినట్టే.