spot_img
Homeఎంటర్టైన్మెంట్Priyamani: వద్దు అని ఆ హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది.. అయినా, బికినీ వేయించి ఆ...

Priyamani: వద్దు అని ఆ హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది.. అయినా, బికినీ వేయించి ఆ పని చేశాడు !

Priyamani: ప్రియమణికి ‘యమదొంగ’ సినిమా తర్వాత బబ్లీ హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఆమె డేట్లు కోసం అప్పట్లో చాలామంది దర్శక నిర్మాతలు ఆమె చుట్టూ తిరిగారు. అయితే, ఇక్కడే పొరపాటు చేసింది ప్రియమణి. ఆ సమయంలో తనకొచ్చిన స్టార్ డమ్ ని క్యాష్ చేసుకోవాలని ఉబలాట పడింది. వచ్చిన ప్రతి చిన్నాచితకా సినిమా ఒప్పేసుకుని బ్యాంక్ బ్యాలెన్స్ ను ఫుల్ గా నింపేసుకుంది. కానీ.. సినిమాల ఎంపికలో ఆమెకు క్లారిటీ లేదు. ఆమె తెలియని తన్నాని ఓ నిర్మాత తనకు అనుకూలంగా వాడుకోవాలని చూశాడు. దాంతో ప్రియమణి బాగా ఇబ్బందులు పడింది.

Priyamani
Priyamani

ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆమెను బాగా ఇబ్బంది పెట్టాడట. ప్రియమణి హీరోయిన్‌గా ఓ సినిమా షూటింగ్ మొదలై సగం షూటింగ్ అయిపోయిన తర్వాత.. ఓ రొమాంటిక్ సీన్ కోసం బికినీ వేయాలని బలవంతం చేశాడట. పైగా బికినీతో పాటు బొడ్డు దగ్గర టాటూ కూడా వేయించుకోవాలని ప్రియమణి వేధించాడట. ఆమె వద్దు అని కన్నీళ్లు పెట్టుకున్నా వదలలేదు అట. ఆమె చేత బికినీ వేయించి, అతనే బలవంతంగా ప్రియమణి బొడ్డు పై టాటూ వేశాడట. ఆ నిర్మాత ఇప్పటికీ ఇండస్ట్రీలోనే ఉన్నాడు. కానీ.. అంతా పోగొట్టుకుని ఖాళీగా తిరుగుతున్నాడు.

Also Read: AP BJP: పొత్తు జనసేనతో..ఉండేది వైసీపీతో.. ఏపీలో బీజేపీ డబుల్ గేమ్

ఇక ప్రియమణికి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. ‘ఫ్యామిలీ మెన్’తో ఆమె కెరీర్ కు మళ్ళీ ఊపు వచ్చింది. నిజానికి ప్రియమణి టాలెంటెడ్ నటి. ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డ్ పొందిన నటి. కాలం కలిసి రాక, ప్రియమణికి స్టార్ డమ్ ఎక్కువ కాలం నిలబడలేదు. పైగా హీరోయిన్ గానూ ఎక్కువ కాలం ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. కాకపోతే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటికీ మంచి రోల్స్ వస్తున్నాయి. అయితే, హీరోయిన్ గా చేసిన తప్పులను ఇప్పుడు చేయకుండా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది.

నిజానికి హీరోయిన్ గా కూడా ప్రియమణి కెరీర్ ను చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంది. తెలుగులో తనకు హీరోయిన్ గా అవకాశాలు ఇచ్చేవాళ్ళు కరువయ్యారు అని అర్ధం కాగానే.. హీరోయిన్ గా కన్నడంలోకి వెళ్ళింది. మధ్యలో తమిళంలో కూడా బాగానే కష్టపడింది. మొత్తానికి అన్నీ భాషల్లో హీరోయిన్ గా గుర్తింపును కోల్పోయాక ఇక చేసేది ఏమి లేక సైలెంట్ గా పెళ్లి చేసుకుని.. డీసెంట్ గా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. కానీ, ఈ లోపు ఓ టీవీ షో వచ్చింది. అంతే.. అన్నీ వదిలేసి ఆ షో చేసింది. ఎలాగూ టీవీ షోలు కూడా చేస్తోంది కాబట్టి.. సీనియర్ హీరోల పక్కన కొన్ని సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. దాంతో, ప్రియమణికి మళ్లీ కొంతవరకు డిమాండ్ క్రియేట్ అయింది.

Priyamani
Priyamani

ముఖ్యంగా నారప్పతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అందుకే, ఇప్పటికీ అవకాశం వచ్చిన ప్రతి సినిమాలోనూ నటిస్తూ భారీగానే అందుకుంటూ ముందుకు పోతుంది. అయినా డబ్బు మీద ఆశ మాత్రం ఈ ముదురు భామకు ఇంకా చావట్లేదు. . ‘ఫ్యామిలీ మెన్’తో హిందీలో బాగా డిమాండ్ పెరిగింది. అందుకే.. అక్కడ తనకు వచ్చిన ఇమేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది. వరుసగా హిందీ వెబ్ సిరీస్ లు చేస్తోంది.

ఈ క్రమంలో ప్రియమణి అవమానాలు కూడా బాగానే ఎదుర్కొంది. ‘కర్ర ఆంటీ’, ‘ఫ్యాట్ పిగ్’ అని కొందరు ఆకతాయిలు ఆన్ లైన్లో ఆమెను వేధించారు. ప్రియమణికి రంకు తక్కువ అయినా, తన అందచందాలతో ఓ ఊపు ఊపింది. కొందరు నెటిజన్లు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి. ఇక ప్రియమణి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ‘ముస్తాఫా రాజ్‌’ని ఆమె పెళ్లి చేసుకుని బెంగళూరులోనే సెటిల్ అయింది.

Also Read: AP Capital Issue: సీబీఐ కేసులో జగన్ లాయరే సుప్రీం కోర్టు సీజేఐ…ఏపీ రాజధాని కేసులపై టీడీపీ నేత డౌట్స్?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper
Exit mobile version