Lottery Tickets: మనదేశంలో చాలా మంది అదృష్టాన్ని నమ్ముకుంటారు. తమకు లాటరీల్లో డబ్బు వస్తుందని భావించి ఎన్నో టికెట్లు కొంటుంటారు. ఇదో వ్యసనంగా మారడం తెలిసిందే. కోట్లాది రూపాయలు లాటరీల కోసం పెట్టినవారున్నారంటే అతిశయోక్తి కాదు. అప్పనంగా వచ్చే డబ్బు కోసం అందరు వెంపర్లాడుతుంటారు. లాటరీ టికెట్ కొనుక్కుని తమకు తప్పకుండా తగులుందని ఆశిస్తున్నారు. రాత్రికి రాత్రే కోటిశ్వరుడిగా మారిపోవాలనే ఉద్దేశంతో ఎన్నో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఫలితంగా ఎందరో అభాగ్యులు లాటరీల ముసుగులో కొట్టుకుపోతున్నారు.
కేరళలో ఓ వ్యక్తి 52 ఏళ్లుగా లాటరీలు కొంటూనే ఉన్నాడు. ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు జారవిడుచుకుంటున్నారు. జీవితంలో ఎప్పటికైనా లాటరీ తగలకపోతుందా అనే ఆశతోనే బతుకుతున్నారు. కూలీ పనిచేస్తున్నా తన బతుకు తీరు మారుతుందనే ఆశతో రోజు లాటరీ టికెట్లు కొనుక్కుని ఆశగా ఎదురుచూస్తుంటాడు. కానీ అతడి కోరిక నెరవేరేందుకు చాలా కాలమే పట్టింది. సంపాదించిన మొత్తంలో కొంత లాటరీ టికెట్ల కోసమే కేటాయిస్తున్నాడు. దీని కోసం అతడు ఏకంగా రూ.3.50 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.
కేరళలోని కన్నౌర్ కు చెందిన రాఘవన్ లాటరీ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. తనకు జీవితంలో ఏనాటికైనా లాటరీ దక్కకపోతుందా అని ఆశించాడు. టికెట్ల కోసం అంత మొత్తంలో ఖర్చయినా అతడి ఆశ మాత్రం చావలేదు. ఏనాటికైనా తన కోరిక తీరకపోతుందా అని అనుకున్నాడు. అయితే అతడి కల నెరవేరేందుకు 52 ఏళ్లు పట్టింది. ఆటో డ్రైవర్ గా పని చేసే అతడు ఇప్పటి వరకు లాటరీల ద్వారా అందుకున్న అత్యధిక బహుమతి రూ.5 వేలే. కానీ అతడి ఆశ మాత్రం అడుగంటలేదు.
ఇటీవల తిరువనంతపురానికి చెందిన ఆటోడ్రైవర్ అనూప్ ఓనమ్ లాటరీలో రూ. 25 కోట్ల బహుమతి సొంతం చేసుకోవడం ఆశ్చర్యపరచింది. అనుకోకుండా ఓనమ్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. శనివారం టికెట్ కొన్న అతడికి ఆదివారమే జాక్ పాట్ తగలడం సంచలనం కలిగించింది. తొలుత అతడు వేరే టికెట్ తీసుకున్నా తరువాత మనసు మార్చుకుని ఓనమ్ లాటరీ తీసుకోవడంతో అతడి దశ తిరిగింది. ఏకంగా రూ.25 కోట్లు దక్కించుకుని అందరిలో ఆశ్చర్యం కలిగేలా చేశాడు. అదృష్టం ఉంటే ఏదైనా సాధ్యమే. కాకపోతే ఎన్ని కొన్నా వ్యర్థమే. రాఘవన్ ఎన్ని టికెట్లు కొన్నా అతడికి రూ.5 వేలు దక్కడం, అనూప్ కు మాత్రం పాతిక కోట్లు దక్కడంతో అందరు ముక్కున వేలేసుకున్నారు.