Homeఅంతర్జాతీయంPanjshir: పంజ్ షీర్ లో భీకర పోరు.. 300 మందికి పైగా తాలిబన్ల హతం

Panjshir: పంజ్ షీర్ లో భీకర పోరు.. 300 మందికి పైగా తాలిబన్ల హతం

300 Taliban terrorists killedPanjshir: అఫ్గనిస్తాన్ (Afghanistan) అట్టుడుకుతోంది. తాలిబన్ల (Taliban) పోరాటం ఇంకా పూర్తి కాలేదు. పంజ్ షీర్ (Panjshir) ప్రాంతం ఆక్రమించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఓ పక్క చర్చలంటూనే మరోపక్క దాడులకు తెగబడుతోంది. దీంతో వందలాది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పంజ్ షీర్ ప్రాంతంలోని ఉత్తరాది దళాలు తాలిబన్లపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో అనేక మంది బందీలుగా చిక్కుతున్నారు. తాలిబన్ల కుటిల నీతికి పంజ్ షీర్ దళాలు దీటుగా జవాబిస్తున్నాయి. చర్చలకు ఆహ్వానిస్తూనే ఆ ప్రాంతాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలను పంజ్ షీర్ దళాలు ప్రతిఘటిస్తున్నాయి.

అఫ్గాన్ నుంచి అమెరికి పూర్తిగా నిష్ర్కమించడంతో తాలిబన్లకు ఊపు వస్తోంది. ఎలాగైనా పంజ్ షీర్ ప్రాంతాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అయినా వారి ఆశలు తీరడం లేదు. పర్వాన్ ప్రాంతంలో పంజ్ షీర్ కు చెందిన నేతలు, గిరిజన తెగలతో జరిపిన చర్చలు విఫలమైనట్లు తాలిబన్ ప్రతినిధి ముల్లా అమిర్ ఖాన్ ముత్తాకి తెలిపారు. దీంతో అఫ్గన్ లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

పంజ్ షీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకుని మొత్తం అఫ్గనిస్తాన్ ను పాలించాలని తాలిబన్లు కలలు కంటున్నారు. వారి కలలను పంజ్ షీర్ ప్రజలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో తాలిబన్ల ఆధిపత్యాన్ని అంగీకరించబోమని చెబుతున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య పోరు జరుగుతోంది. ఇందులో ఇప్పటివరకు 350 తాలిబన్ ఫైటర్లను చంపినట్లు ఉత్తర కూటమి దళాలు ప్రకటించాయి. మరో 130 మందిని బందీలుగా చేసుకున్నట్లు వెల్లడించాయి. దీంతో తాలిబన్ల ఆశలు అడియాశలే అవుతున్నాయని తెలుస్తోంది.

గతంలో తాలిబన్లతో స్నేహపూర్వకంగా వ్యవహరించిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా తాలిబన్లకు శుభాకాంక్షలు చెబుతూ తన కుట్రలకు ఆజ్యం పోస్తోంది. అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చేందుకే అల్ ఖైదా తాలిబన్లతో స్నేహహస్తం అందిస్తోందని చెబుతున్నారు. ఈ పరిణామాలతో తాలిబన్లకు కష్టాలు ఎదురు కానున్నాయి. ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా ఆగడాలకు అంతు ఉండదు. దానితో చెలిమి తాలిబన్లకే చెడ్డ పేరు తెస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

అఫ్గనిస్తాన్ లో తాలిబన్లను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని అల్ ఖైదా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ప్రపంచ దేశాలతో తాలిబన్లు సంబంధాలు మెరుగుపరుచుకుంటే ఇక తమ సంస్థతో పని ఉండదని భావించి అల్ ఖైదా ఈ కుట్రలకు తెర లేపుతోందని సమాచారం. అఫ్గనిస్తాన్ గడ్డపై అడుగుపెట్టి తమ కార్యకలాపాలు విస్తరించుకోవాలని అల్ ఖైదా చూస్తున్నట్లు తెలుస్తోంది.

అల్ ఖైదా కాశ్మీర్ సమస్యను కూడా ప్రస్తావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం శత్రువుల చేతుల్లో ఉన్న ప్రాంతాలకు విముక్తి కల్పించాలని చెబుతోంది. కాశ్మీర్, పాలస్తీనా, లెవాంట్, సోమాలియా, యెమెన్ లకు కూడా విముక్తి కల్పించాలని కోరుతోంది. ప్రపంచవ్యాప్తంగా బందీలుగా ఉన్న ముస్లింలను విడిపించాలని సూచిస్తోంది. దీంతో తాలిబన్లు అల్ ఖైదా ఉచ్చులో పడితే అంతే సంగతి ప్రపంచ వ్యాప్తంగా వారిని కూడా టార్గెట్ చేసి అంతమొందించేందుకు ప్రపంచ దేశాలు కట్టడి చేస్తాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాలిబన్ల నిర్ణయం ఎటు వైపో తేలాల్సి ఉందని సమాచారం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version