TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ టీటీడీ కానుకలు

TTD: తిరుమలలో భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు మొక్కుతారు. తమ దేవుడికి కానుకలు అప్పగిస్తారు. తాము ఎంతో ఇష్టంతో జమ చేసిన చిల్లర డబ్బుల్ని స్వామి వారి హుండీలో వేస్తారు. కాపాడు దేవుడా అని మొక్కుకుంటారు. ప్రస్తుతం ఆ చిల్లర ఎలా వినియోగించాలో టీటీడీ (TTD) అధికారులకు అర్థం కావడం లేదు. భక్తులు వేస్తున్న చిల్లర సంచుల్లో నిండిపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో వారిలో ఓ ఆలోచన వచ్చింది. భక్తులు వేస్తున్న చిల్లర వారికే అందిస్తే […]

Written By: Srinivas, Updated On : September 3, 2021 10:45 am
Follow us on

TTD: తిరుమలలో భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు మొక్కుతారు. తమ దేవుడికి కానుకలు అప్పగిస్తారు. తాము ఎంతో ఇష్టంతో జమ చేసిన చిల్లర డబ్బుల్ని స్వామి వారి హుండీలో వేస్తారు. కాపాడు దేవుడా అని మొక్కుకుంటారు. ప్రస్తుతం ఆ చిల్లర ఎలా వినియోగించాలో టీటీడీ (TTD) అధికారులకు అర్థం కావడం లేదు. భక్తులు వేస్తున్న చిల్లర సంచుల్లో నిండిపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో వారిలో ఓ ఆలోచన వచ్చింది.

భక్తులు వేస్తున్న చిల్లర వారికే అందిస్తే ఎలా ఉంటుందని భావించారు. దీన్ని బ్యాంకులు కూడా జమ చేసుకోవడం లేదు. ఈ క్రమంలో చిక్కులు వస్తున్నాయి. చిల్లర వినియోగంపై స్పష్టత లేకుండా పోతోంది. టీడీపీ అధికారులు కానుకల రూపంలో వచ్చిన సొమ్మును భక్తులకే ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచనలో పడ్డారు. దీంతో ఇదే సరైన మార్గమని గుర్తించి ప్రస్తుతం ధన ప్రసాదం అనే పేరుతో స్టిక్కర్ వేసి భక్తులకు టీటీడీ తరఫున ఇచ్చేందుకు ప్రణాళిక రచించారు.

తిరుమలలో గదులు బుక్ చేసుకునేటప్పుడు కాషన్ డిపాజిట్ కట్టించుకుంటారు. తిరిగి వెళ్లేటప్పుడు దాన్ని తిరిగి చెల్లిస్తారు. దీంతో ఆ కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే సమయంలో శ్రీవారి ధన ప్రసాదం పేరుతో ఈ చిల్లరను భక్తుల చేతిలో పెడుతున్నారు. దీంతో చిల్లర వినియోగంపై చిక్కుముడి వీడిపోతోంది. భక్తులు కూడా వద్దనకుండా స్వామి వారి ప్రసాదం అని కళ్లకు అద్దుకుని మరీ తీసుకుంటున్నారు. దీంతో చిల్లర సమస్య తీరినట్లయిందని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

టీటీడీ అధికారుల ప్రణాళిక విజయవంతం కావడంతో చిల్లర సమస్య క్లియర్ అయింది. కానీ ఎవరైతే భక్తులు కానుకలు సమర్పిస్తారో వారికే ఈ చిల్లర అంటగడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో చిల్లర సమస్యను అల్లర కాకుండా చూసిన అధికారుల ముందుచూపుకు అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎంతైనా మన అధికారులు ఆలోచనల్లో శ్రీవారినే మించిపోయారని చెబుతూ చలోక్తులు విసురుతున్నారు.

భక్తులు ముడుపుల రూపంలో ఇచ్చిన చిల్లరను మళ్లీ భక్తులకే ఇవ్వడం విస్మయాన్ని కలిగిస్తోంది. బ్యాంకుల్లో జమ చేద్దామంటే చిల్లరను చూస్తేనే వారు చిర్రెత్తిపోతున్నారు. దీంతో టీటీడీ అధికారులు ఈ ఆలోచన చేసి దానికి కార్యరూపం తెచ్చారు. భక్తులు తెచ్చిన సొమ్మును వారి మెడకే కట్టేసి వారిలో కూడా భక్తిపారవశ్యాన్ని నింపుతున్నారు.