CM KCR: కేవలం మూడు నెలలు. మూడండే మూడే నెలలు. ఈ స్వల్పకాలానికి పట్నం మహేందర్‌రెడ్డిని కేసీఆర్ మంత్రిని చేశారు. సమాచార, గనుల శాఖను కట్టబెట్టారు. ఈ మూడు నెలల్లో ఆయన పెద్దగా చేసేదీ ఏముంటుంది? విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఆ శాఖలకు పెద్దగా బడ్జెట్ కూడా లేదు. కేసీఆర్ ఇలా అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి గల కారణం రంగారెడ్డి జిల్లాలో ఆయనకు ఇబ్బంది లేకుండా చూసుకునేందుకే. పట్నం మహేంద్‌రెడ్డి తాండూరు స్థానం కావాలని అడుగుతున్నారు. ఇదే స్థానంలో గతంలో ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న పైలెట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. అప్పట్లో కేసీఆర్ రచించి వదిలిన ‘మొయినాబాద్ ఫామ్ హౌస్’ ఎపిసోడ్‌లో రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. దీనిని సాకుగా చూపి కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకున్నాడు. రోహిత్‌రెడ్డిని తెలంగాణ హీరోగా అభివర్ణించాడు. సో ఏ లెక్కన చూసుకున్నా రోహిత్‌రెడ్డిని కేసీఆర్ వదులుకోలేడు. అందుకే టికెట్ అతడికి ఇచ్చారు. కేసీఆర్ చేతిలో భంగపడిన మహేందర్‌రెడ్డి తిరుగుబావుటా ఎగరేసేందుకు సిద్ధం కాగా, ఆయనకు అప్పటికప్పుడు ఎమ్మెల్సీ పదవి, మంత్రి పదవి ఇచ్చారు. అయితే అందితే జుట్ట లేకుంటే కాళ్లు సిద్ధాంతాన్ని పాటించే కేసీఆర్.. మిగతా వారి విషయంలో ఇదే సూత్రాన్ని పాటించబోతున్నారా? అంటే దీనికి ఔను అనే సమాధానం వస్తోంది.
మూడు నెలల ముందుగానే ఎన్నికల శంఖారావం ఊదిన కేసీఆర్ 115 స్థానా లకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో ఏడు మినహా మిగతా అన్ని స్థానా ల్లోనూ సిట్టింగ్‌లనే నిలిపారు. రేఖానాయక్, రాములు నాయక్‌కు టిక్కెట్లు నిరా కరించేందుకు కారణాలను స్పష్టంగా పేర్కొనలేదు. అయితే టికెట్లు దక్కని వారు కేసీఆర్ మీద నేరుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి బాధ్యత కూడా కేసీఆర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు కేసీఆర్ ఆడిన పాచికల వల్ల చాలా మంది బీఆర్‌ఎస్‌లో చేరారు. దీనివల్ల సహజంగానే పార్టీలో మోయలేనంత బరువు పెరిగింది. వచ్చిన వారందరికీ పదవులు ఇస్తామని ఆశ పెట్టడం, దానిని తర్వాత అమలు చేయక పోవడంతో అసంతృప్తి వ్యక్తమైంది. ఇన్నాళ్లూ ఇది నివురుగప్పిన నిప్పులాగానే ఉండేది. ఇప్పుడు టికెట్ల కేటాయింపు తర్వాత బయటపడుతోంది. తుమ్మల నాగేశ్వరరావు బలప్రదర్శన ఆ కోవ లోనిదే.
ఈ పరిస్థితిని కేసీఆర్ ఊహించనట్టున్నారు. అయితే అభ్యర్థుల ప్రకటన సమయంలోనే ఓ కీలక ప్రకటన చేశారు. ‘ఇప్పుడు నేను ప్రకటిస్తున్న అభ్యర్థు ల్లో ఎవరైనా పార్టీ లైన్ దాటితే వేటు ఖాయమని’ సంకేతాలు ఇచ్చారు. అంటే టిక్కెట్ల కేటాయింపు సమయానికి కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయన్నమా ట. ఇదే ఇప్పుడు బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో అంతర్మథనానికి కారణమవు తోంది. అస లు తమ పేరయితే ప్రకటించారు గాని టికెట్ ఇస్తారా? లేదా? అనే సంశయం నెలకొంది. పైకి కేసీఆర్ వీరవిధేయులుగా నటించినప్పటికీ.. రాజకీయాలంటేనే అవసరాలు కాబట్టి.. ఆ కోణంలోనే బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. అభ్య ర్థుల ప్రకటన జరిగినప్పటికీ.. కేసీఆర్ నియమించిన ప్లాష్ సర్వే బృందాలు పని చేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘ఇల్లు అలగకానే పండగ కాదు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల నియోజకవర్గాల్లో అసంతృప్తులు తమ గళం వినిపిస్తున్నారు. దీన్ని సాకుగా చూపి వేరే వారికి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని’ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి మరో మూడు నెలల్లో ఏం జరుగుతుందో?!