Homeజాతీయ వార్తలుMLA Tatikonda Rajaiah: రాజయ్య ఏడిస్తే కేసీఆర్‌ మనసు కరుగుతుందా?

MLA Tatikonda Rajaiah: రాజయ్య ఏడిస్తే కేసీఆర్‌ మనసు కరుగుతుందా?

MLA Tatikonda Rajaiah: బీఆర్‌ఎస్‌ టికెట్‌ రాని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య… ’కేసీఆర్‌ నా దేవుడు.. ఆయన గీసిన గీత దాటను..‘ అంటూ చాలా కృతజ్ఞతగా వెక్కి వెక్కి ఏడుస్తూ సాగిలపడి దండం పెట్టారు. టికెట్‌ దక్కకపోవడం బాధాకరమే అయినా, రాజయ్య అంతలా ఏడ్వడం ఎందుకనేదే ప్రశ్న. బీఆర్‌ఎస్‌లో చాలామంది లోలోపల ఏడుస్తుంటారని, రాజయ్య లాంటి వారు ఇలా బయటపడి పోతుంటారని రాజకీయాలను నిశితంగా పరిశీలించే మిత్రుడొకరు వ్యాఖ్యానించారు.

ఈ ఏడుపుగొట్టు రాజకీయాలు ఇటీవలి కాలంగా బాగా పెరిగిపోయాయి. టికెట్‌ దక్కనప్పుడో, ఎన్నికల్లో ఓడినప్పుడో నేతలు.. ’సర్వం‘ కోల్పోయినట్టు కన్నీరుమున్నీరు కావడం విస్తుగొలుపడం అటుంచి, జుగుప్సను మాత్రం కలిగిస్తుంది. పదవులు ప్రజాసేవ చుట్టూ తిరగకుండా, ’పవర్‌‘ చుట్టూ తిరగ డం వల్ల వచ్చిన సమస్య ఇది. ఒకసారి ’పవర్‌ పటాటోపం‘ అలవాటైన తర్వాత నాయకులు అంత ఈజీగా దానిని వదులుకోలేరు.

నిజానికి రాజకీయాలు వేరు.. అధికార రాజకీయాలు వేరు. ఎన్ని కోట్లయినా ఉండనీ, కానీ అధికారిక పదవిలో దక్కే కిక్కే వేరుగా ఉంటుంది. మిలియనీర్లు, బిలియనీర్లు, పారిశ్రామికవేత్తలు.. రాజ్యసభ సభ్యత్వాల కోసం తహతహలాడేది అందుకోసమే. రాజ్యాంగ పదవుల ద్వారా ఒనగూరే ’పవర్‌‘ చాలామందికి ఒక వ్యసనం, ఒక సరదా. పదవుల ద్వారా సంపాదించే డబ్బు, ఆస్తుల కన్నా అది చాలా ఎక్కువ.

ఇక రాజయ్య విషయానికి వద్దాం. దళితుడైన రాజయ్య ఉన్నత విద్యావంతుడు. వరంగల్‌లో పిల్లల వైద్యుడిగా ప్రసిద్ధుడు. థతీవలో టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఉప ముఖ్యమంత్రిగా నియమితుడయ్యారు. ఆ తర్వాత ఆర్నెల్లకే అనూహ్యంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయి ఉపముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్నారు. అపుఁడాయనను ఎందుకు బర్తరఫ్‌ చేశారనేది ఎవరికీ తెలియదు. ప్రభుత్వం గానీ, పార్టీ గానీ క్లారిటీ ఇవ్వలేదు. రాజయ్య బలహీనతలపై అప్పుడు కూడా విస్తృత చర్చ జరిగింది. ఆ తర్వాత థతీశీలో జరిగిన ఎన్నికల్లో రాజయ్యకే టికెట్‌ కేటాయించగా నాలుగోసారి విజయం సాధించారు.

రాజయ్య ప్రవర్తన సభ్య సమాజం హర్షించనిదే అయినపఁటికీ, ఎన్నికల గోదాలో మాత్రం ఆయనకు ప్రజామోదం దక్కుకుంటూ వస్తోంది. ఆ మధ్య స్టేషన్‌ ఘన్‌పూర్‌ పాత్రికేయ మిత్రులతో మాట్లాడినపుఁడు రాజయ్య ప్రవర్తన, బలహీనతలను ఇక్కడి ప్రజలు పెద్దగా పట్టించుకోరని, ఆయనకు ప్రజల్లో పట్టు సడల లేదని వ్యాఖ్యానించారు. అంటే రాజయ్యను ఇంకేదో కోణంలో ప్రజలు ఆదరిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇదొక వైరుధ్యం.

గత తీవీ ఏళ్లుగా ఏకధాటిగా ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య… అనేకమంది ఇతర ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే వెనకేసుకున్నది తక్కువే అంటారు. నిజానికి రాజయ్యపై వచ్చిన ఆరోపణలు చిల్లరమల్లరవి. అవి ఇంకా చట్టపరంగా రూఢీ కావాల్సి ఉంది. కడియం శ్రీహరితో ఆయన వైరం ఇప్పటిది కాదు. కొన్ని సందర్భాల్లో కడియంపై చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదనీయం కావు. అయితే ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గమైన స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం ఏ మెజారిటీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తారని రాజయ్య అనేకసార్లు వేసిన ప్రశ్న విలువైనది.

రాజయ్యకు ఎందుకు టికెట్‌ నిరాకరించాల్సి వచ్చిందో, అందుకు కారణాలేమేటో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం చెప్పకపోవచ్చు. ’నా పార్టీ.. నా ఇష్టం..‘ అని అధినేతలు హూంకరించే చోట ప్రజాస్వామ్యం ఏనాడూ చెల్లకపోవచ్చు. టికెట్లు కొందరికి ఎందుకిస్తారో.. కొందరికి ఎందుకివ్వరో.. వాటికి ప్రాతిపదిక ఏమిటో.. ఏనాటికీ తేలకపోవచ్చు. ప్రాంతీయ పార్టీలన్నీ పైవ్రేటు లిమిటెడ్‌ కంపెనీలు. అక్కడ జెండాలు మోసిన వారు ఎన్నటికీ యజమానులు కాలేరు. అన్ని ప్రశ్నలకు అక్కడ జవాబులు దొరకవు.

తీవీ ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా వ్యవహరించిన రాజయ్య… ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు. ఆరోపణలనూ, అవమానాలనూ ఎదుర్కొన్నారు. తన ప్రవర్తన తీరుతో అత్యంత వివాదాసఁదుడయ్యారు. తనను తాను మార్చుకునే ప్రయత్నం చేసుకోలేకపోయారు. ఐదోసారి టికెట్‌ దక్కనంత మాత్రాన ఏం కోల్పోతానని వెక్కి వెక్కి ఏడ్చాడో.. దండం పెడుతూ ఎందుకలా సాగిలపడ్డాడో… అర్థం కాని అంశం. బహుశా పవర్‌ పటాటోపానికి అలవాటైన ప్రాణం ఆయన చేత అలా చేయించి ఉండొచ్చు. లేదంటే తరతరాలుగా వెంటాడుతున్న జాతి న్యూనత అయననా స్థితికి నెట్టివేసి ఉండొచ్చు.

టికెట్‌ వస్తే ఎంత.. రాకుంటే ఎంత.. అని రాజయ్య ప్రకటించి ఉంటే, ఆయన ఎంతో కొంత విలువను కాపాడుకుని ఉండేవారు. జనం నుంచి సానుభూతిని పొందేవారు. తీవీ ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా నిటారుగా నిలబడే సత్తువను సంపాదించుకోలేక పోవడం రాజయ్య లోపం. సమకాలీన రాజకీయాల్లో ’బలహీన‘ తరానికి రాజయ్య లాంటి వాళ్లు ఒక ప్రతీక. ఈ బలహీనతను అధిగమించే మరో తరం రావడానికి ఇంకొన్ని ఏళ్లు పట్టవచ్చు. చివరగా, రాజయ్యను నాడు ఎందుకు బర్తరఫ్‌ చేశారో.. నేడు ఎందుకు టికెట్‌ నిరాకరించారో… బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కాస్త వివరంగా చెబితే బాగుండు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular