Jagan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. జగన్ వర్సెస్ విపక్షాలు అన్న చందంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో జగన్ పై బాధ్యతలు మరింత పెరగనున్నాయి. గతంలో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చిన సంఘటనలు లేకపోయినా ప్రస్తుతం మాత్రం అధికారం కోసం విపక్షాలు ఏకం అవుతుండటంపై వైసీపీలో కూడా ఆందోళన నెలకొన్నట్లు కనిపిస్తోంది. దీంతో తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన సభలో విపక్షాలు ఐక్యతను చాటడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు అమరావతి రైతుల కోసం ఒకే వేదికపైకి వచ్చి తమ సమ్మతి తెలియజేయడం ఆహ్వానించదగినదే. ఈ నేపథ్యంలో వైసీపీకి కష్టకాలమే అని చెప్పాలి. అన్ని పార్టీలు ఏకమైతే వైసీపీకి కష్టాలు తప్పవేమో అనే సందేహాలు వస్తున్నాయి. దీంతో జగన్ ఏ మేరకు ప్రతిపక్షాలను ఎదుర్కొనే విధంగా వ్యూహాలు రూపొందిస్తారో తెలియడం లేదు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా విపక్షాలు ఏకమైనా కాంగ్రెస్ విజయం సాధించడం తెలిసిందే. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు ప్రస్తుతం నెలకొన్న నేపథ్యం వేరు. దీంతో వైసీపీకి ముందు పెను ప్రమాదమే పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీతో చేరడం ఇష్టం లేకపోయినా సీపీఎం మాత్రం జగన్ పై ఉన్న కోపంతోనే కలవడం విశేషం.
Also Read: AP Govt: కొత్త రూల్స్ తో థియేటర్లకు సినిమా చూపించబోతున్న ఏపీ సర్కార్..!
ఈ పరిస్థితుల్లో రాజకీయాలు మరింత వేడిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమరావతి ఎజెండాపై కలిసిన విపక్షాలు కడదాకా కలిసుంటాయా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. దీంతో ఏపీలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో ఏ మార్పులు చోటుచేసుకుంటాయో తెలియం లేదు. వచ్చే ఎన్నికల నాటికి ఎవరు ఎవరితో జట్టు కడతారో కూడా తేలాల్సి ఉంటుంది.
Also Read: YCP: టీడీపీ పొత్తుల వ్యవహారం వైసీపీలోనే హాట్ టాపిక్.. ఎందుకంటే..?