https://oktelugu.com/

Pawan Kalyan: ఇప్పటికీ ఎప్పటికీ నెంబర్ వన్ పవన్ కళ్యాణే

Pawan Kalyan: టాలీవుడ్ లో ‘నెంబర్ వన్ ప్లేస్’ మీదే అంటూ ‘పుష్ప’ ప్రెస్ మీట్ లో సినీ జర్నలిస్ట్ లు మీడియా సమావేశం సాక్షిగా తేల్చి చెప్పారు. అయితే, ఈ కామెంట్లు ఇప్పుడు మిగిలిన హీరోల అభిమానులకు నచ్చడం లేదు. మహేష్ బాబు నెంబర్ వన్ అంటున్నారు, కాదు.. వరుసగా 6 హిట్లు ఉన్న ఎన్టీఆర్ నెంబర్ వన్ అంటున్నారు. అసలు పాన్ ఇండియా రేంజ్ మా హీరోది, కాబట్టి మా ప్రభాసే నెంబర్ వన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 18, 2021 / 05:29 PM IST
    Follow us on

    Pawan Kalyan: టాలీవుడ్ లో ‘నెంబర్ వన్ ప్లేస్’ మీదే అంటూ ‘పుష్ప’ ప్రెస్ మీట్ లో సినీ జర్నలిస్ట్ లు మీడియా సమావేశం సాక్షిగా తేల్చి చెప్పారు. అయితే, ఈ కామెంట్లు ఇప్పుడు మిగిలిన హీరోల అభిమానులకు నచ్చడం లేదు. మహేష్ బాబు నెంబర్ వన్ అంటున్నారు, కాదు.. వరుసగా 6 హిట్లు ఉన్న ఎన్టీఆర్ నెంబర్ వన్ అంటున్నారు. అసలు పాన్ ఇండియా రేంజ్ మా హీరోది, కాబట్టి మా ప్రభాసే నెంబర్ వన్ అంటున్నారు ‘ప్రభాస్ ఫ్యాన్స్’.

    Pawan Kalyan

    ఎవరి వాదన ఎలా ఉన్నా.. పవన్ ఫ్యాన్స్ మాత్రం మా హీరో వదిలేసిన నెంబర్ అది అని గర్వంగా సగర్వంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ గురించి గొప్పగా మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. నిజమే.. ‘పవర్ స్టార్’.. ఇది ఒక పేరు కాదు, ఓ ప్రభంజనం. మొదట్లో పవన్ పవర్ స్టార్ గా ఎదుగుతాడు అని ఎవ్వరూ ఊహించలేదు.

    నిజానికి పవన్ ని హీరోగా పరిచయం చేయడానికి అప్పట్లో స్టార్ డైరెక్టర్లు ఎవరూ ముందుకు రాలేదట. కానీ, ఆ తర్వాత వరుస హిట్లు కొట్టాడు. స్టార్ డైరెక్టర్లు క్యూ కట్టారు. ఇక మెగాస్టార్ చిరంజీవి వారసుడు అన్నారు. మెగాస్టార్ తర్వాత పవర్ స్టారే అన్నారు. కానీ ఓ దశలో మెగాస్టార్ నే మించిపోయాడు. పవన్ పై ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

    Also Read: Pushpa: ‘పుష్ప’కు అన్ని కోట్లు పెట్టినా క్వాలిటీ ఎక్కడా కనిపించిందే లే?

    కురాళ్ళల్లో పవన్ పై అభిమానం కాదు, ప్రేమ మొదలైంది. అప్పటి నుంచే వారంతా పవన్ కళ్యాణ్ అభిమానులు గా మారుతూ వచ్చారు. పవన్ నటన చూసి అభిమానులుగా మారిన వారు కొందరు అయితే, పవన్ వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని చూసి అభిమానులుగా మారిన వారు ఎక్కువ మంది. అందుకే, తెలుగు సినిమాల్లో ఒక్క ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ సినిమాకే హిట్ ప్లాప్ లతో సంబదం లేదు.

    పవన్ ప్లాప్ సినిమాలకు కూడా కలెక్షన్ల సునామీ వస్తోంది. అదీ పవన్ రేంజ్ అంటే. అందుకే, ఇప్పటికీ ఎప్పటికీ నెంబర్ వన్ పవన్ కళ్యాణే.

    Also Read: Rashi Khanna: 8ఏళ్ల తర్వాత బాలీవుడ్​లోకి రీ ఏంట్రీ.. అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రాశీఖన్నా

    Tags