https://oktelugu.com/

Pushpa Deleted Scene: ‘పుష్ప’ వ్యాన్​లో రొమాన్స్ సీన్​ డిలీట్​.. కారణం అదేనట?

Pushpa Deleted Scene: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియా కనిపిస్తోంది. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినమా వరుసగా బాక్సాఫీసు బద్దలు కొడుతోంది. ఓ వైపు అక్కడక్కడా మిక్స్​డ్​ టాక్​ వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా తొలిరోజు ఇరగదీసింది. దాదాపు రూ. 38.49 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.  ఇదిలా ఉంటే సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించిన సంగతి తెలిసిందే. బన్నీ సినిమాలో పుష్పగా కనిపించగా..  శ్రీవల్లిగా రష్మిక కనువిందు చేసింది. వీరిద్దరి మధ్య జరిగే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 18, 2021 / 05:21 PM IST
    Follow us on

    Pushpa Deleted Scene: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియా కనిపిస్తోంది. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినమా వరుసగా బాక్సాఫీసు బద్దలు కొడుతోంది.

    ఓ వైపు అక్కడక్కడా మిక్స్​డ్​ టాక్​ వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా తొలిరోజు ఇరగదీసింది. దాదాపు రూ. 38.49 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.  ఇదిలా ఉంటే సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించిన సంగతి తెలిసిందే. బన్నీ సినిమాలో పుష్పగా కనిపించగా..  శ్రీవల్లిగా రష్మిక కనువిందు చేసింది. వీరిద్దరి మధ్య జరిగే కొన్ని లవ్​ సీన్లు మంచిగా రక్తి కట్టించారు సుకుమార్​.

    Pushpa Deleted Scene

    Also Read: ‘పుష్ప’కు అన్ని కోట్లు పెట్టినా క్వాలిటీ ఎక్కడా కనిపించిందే లే?

    పుష్ప- శ్రీవల్లిల మధ్య నడిపిన చేయి ఎపిసోడ్​ హైలైట్​గా నిలిచింది. సెకండ్​ఆఫ్​లో కారులో అల్లు అర్జున్​ కూర్చుని శ్రీవల్లి భుజంపై చేయి వేసి ఫోన్ మాట్లాడతాడు. ఆ తర్వాత పుష్ప చేయి శ్రీవల్లి ప్రైవేట్​ పార్ట్​పై వేసినట్లుగా చూపిస్తారు. అయితే, అది ఫ్యామిలి ఆడియన్స్ కాస్త ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఇది సుక్కూ మార్క్ కాదని.. అలా అలోచించడని అనుకున్నారంత.

    అలా అనుకుని థియేటర్​కు వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్​కు షాక్ తగిలింది. ఈ క్రమంలోనే తొలి రోజు ఫీడ్​బ్యాక్​లో ఆ సీన్​ గురించి పలువురు ప్రస్తావించడంతో.. ఆ సీన్​ను సినిమా నుంచి తొలగించాలని ఫిక్స్ అయ్యారంట.. ఆదివారం నుంచే ఆ సీన్​ను సినిమాలో లేకుండా ప్రదర్శించనున్నట్లు సమాచారం. కాగా, భారీ బడ్జెట్​తో తెరకెక్కించిన ఈ సినిమాలో సునీల్​, అనసూయతో పాటు పలువురు కీలక పాత్రలు పోషించారు. ప్రతి ఒక్కరూ తమతమ పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయి జనాల్లోకి స్లో పాయిజన్​లో సినిమాను ఎక్కించేశారు.

    Also Read: అక్కడ సరైన ప్రమోషన్స్​ లేకున్నా.. పుష్పరాజ్ అస్సలు​ తగ్గలేదుగా?