TRS: టీఆర్ఎస్ కు వ్యతిరేకత వస్తోంది. పార్టీ విధానాలతో విసిగిపోతున్న నేతలు తమలోని ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారిని కోపం ఓట్ల రూపంలో ప్రదర్శించారు. పార్టీలో ఉన్న ప్రయోజనాలు మాత్రం శూన్యమే అని తెలుసుకుని తమ కోసం కూడా ఆలోచించడం లేదని ఆవేదన చెందుతున్నారు. కొన్ని చోట్ల బాహాటంగానే తమకు పార్టీలో ఉన్నా ఏ మాత్రం లాభం జరగడం లేదని చెబుతున్నారు. దీంతో వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తో అధికార పార్టీకి సవాలు విసిరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలిచినా క్రాస్ ఓటింగ్ మాత్రం పార్టీని ఆందోళనలో పడేస్తోంది. నేతల్లో ఉన్న కోపంతోనే ఇతర పార్టీల వారికి ఓటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ దీనిపై పోస్టుమార్టం నిర్వహిస్తోంది. ఎందుకు నేతలు క్రాస్ ఓటు వేశారో అనే దానిపై డైలమాలో పడుతోంది. నేతల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని ఎలా అదుపు చేయాలనే దానిపై చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఒక్క ఆదిలాబాద్ మినహా అన్ని జిల్లాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఖమ్మంలో అయితే మరింత దారుణంగా మారింది పరిస్థితి. దీంతో అధికార పార్టీ ఆలోచనలో పడింది. రాబోయే ఎన్నికల్లో ఇలాగే ఉంటే విజయం సాధ్యం కాదనే విషయం గ్రహిస్తోంది. దీంతో నేతల్లో పెరుగుతున్న ఆగ్రహం అదుపు చేసే క్రమంలో వారిని ఎలా బుజ్జగించాలనే దాని మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. శిబిరాలు నిర్వహించినా క్రాస్ ఓటింగ్ చోటుచేసుకోవడంపై పార్టీ ప్రధానంగా దృష్టి పెడుతోంది. తాయిలాలు ఇచ్చినా తమ దారికి రాకుండా ఇతర పార్టీలకు ఓటు వేయడమేమిటని ఆరా తీస్తోంది.
Also Read: Mallanna Army: ‘మల్లన్న’ సైన్యంపై గురిపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్?
అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలే నేతల ఆందోళనకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. పార్టీ జెండాతో గెలిచినా తరువాత క్రమంలో వారికి ఎలాంటి నిధులు రావడం లేదు. చేసిన పనులకు బిల్లులు రావడం లేదు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక తిప్పలు పడుతున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు ప్రధాన కారణంగా చెబుతున్నారు
Also Read: Gone Prakash Rao: ఐఏఎస్ ల అవినీతి చిట్టా నా దగ్గర ఉంది.. గొనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు