https://oktelugu.com/

Viktrina: విక్కీకోసం పంజాబీ నేర్చుకున్న కత్రినా.. ఎందుకో తెలుసా?

Viktrina: బాలీవుడ్​లో ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవరు మాట్లాడుకున్నా కత్రినా- విక్కీ వివాహం గురించే.. ఇటీవలే రాజస్థాన్​లోని ఓగ్రాండ్​ హోటల్​లో వివాహం చేసుకున్న ఈ జంట.. నిన్న ముంబయిలో అడుగుపెట్టారు. పెళ్లికి ముందే ప్రేమ అనే బంధంతో ఏకమైన వీరిద్దరు.. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటై.. ముంబయి విమానాశ్రయమలో ఒకర చేయ ఒకరు పట్టుకుని మరి కెమెరాలకు ఫోజులిచ్చారు. తమకు స్వాగతం చెప్పేందుకు వచ్చిన వారిని, మీడియాను ఆత్మీయంగా పలకరించారు. అయితే, హాంకాంగ్​లో పుట్టిన కత్రినా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 11:42 AM IST
    Follow us on

    Viktrina: బాలీవుడ్​లో ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవరు మాట్లాడుకున్నా కత్రినా- విక్కీ వివాహం గురించే.. ఇటీవలే రాజస్థాన్​లోని ఓగ్రాండ్​ హోటల్​లో వివాహం చేసుకున్న ఈ జంట.. నిన్న ముంబయిలో అడుగుపెట్టారు. పెళ్లికి ముందే ప్రేమ అనే బంధంతో ఏకమైన వీరిద్దరు.. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటై.. ముంబయి విమానాశ్రయమలో ఒకర చేయ ఒకరు పట్టుకుని మరి కెమెరాలకు ఫోజులిచ్చారు. తమకు స్వాగతం చెప్పేందుకు వచ్చిన వారిని, మీడియాను ఆత్మీయంగా పలకరించారు.

    Viktrina

    అయితే, హాంకాంగ్​లో పుట్టిన కత్రినా కైఫ్​.. లండన్​లో పెరిగింది. కాబట్టి, ఆమె మాతృభాష ఇంగ్లీష్​ అనే చెప్పుకోవచ్చు. అయితే, బాలీవుడ్​లో అడుగుపెట్టిన తర్వాత హిందీ కూడా నేర్చుకుని.. అనేక సార్లు పలు ఇంటర్వ్యూల్లో హిందీ స్పష్టంగా మాట్లాడింది. అయితే, ఇప్పుడు మరో ఆసక్తిక విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవలే పంజాబీ కూడా నేర్చుకున్నట్లు తెలుస్తోంది.

    Also Read: మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన మరో బాలీవుడ్ జంట…

    కత్రినాతో జీవితం పంచుకున్న విక్కీ కౌశల్​ది పంజాబ్​. అందులో అత్తవారింట్లో అడుగుపెట్టే ముందే పంజాబీ భాషను ఒడిసిపట్టిందట కత్రినా. విక్కీ కుటుంబసభ్యులతో కలిసిపోయేందుకు ఇదీ ఒక కారణమట.

    తాజాగా ఈ విషయంపై విక్కీ కౌశల్ కజిన్​ స్పందించారు. కత్రినా ఇప్పుడు పంజాబీ చాలా స్పష్టంగా మాట్లాడగలదని అన్నారు. వివాహం సమయంలో కూడా తమ కుటుంబ సభ్యులతో ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్​లో మాట్లాడలేదని.. మొత్తం పంజాబీలోనే సంభాషించినట్లు పేర్కొన్నారు.  కాగా, తమ వివాహానికి హాజరు కాలేని అతిథుల కోసం ముంబయిలో గ్రాండ్​ రిసెఫ్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

    Also Read: ఆ హీరోయిన్ కి డేటింగ్ లు, కేసులు కొత్తేమి కాదట !