https://oktelugu.com/

అసోంలో అడ్డం తిరుగుతున్న బీజేపీ కథ..

ఇప్పటి వరకు ఎదురులేకుండా విజయాల పరంపర కొనసాగిస్తున్న బీజేపీ తొలిసారి ఎదురీదుతోంది. సరికొత్త వ్యూహాలతో ఎన్నికల పాచికలు వేసే నాయకులే అక్కడి ప్రజలు.. రాజకీయ నాయకులు పంచులు వేస్తున్నారు. బీజేపీ అనుసరించే పద్ధతినే ఇప్పుడు ఇతర పార్టీల నేతలు పాటించేసరికి కమలం నేతలకు కదలకుండా అవుతోంది. ఫలితం ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం పోతోంది. అన్నిచోట్ల ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ తో సహా […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 12, 2021 11:21 am
    Follow us on

    BJP
    ఇప్పటి వరకు ఎదురులేకుండా విజయాల పరంపర కొనసాగిస్తున్న బీజేపీ తొలిసారి ఎదురీదుతోంది. సరికొత్త వ్యూహాలతో ఎన్నికల పాచికలు వేసే నాయకులే అక్కడి ప్రజలు.. రాజకీయ నాయకులు పంచులు వేస్తున్నారు. బీజేపీ అనుసరించే పద్ధతినే ఇప్పుడు ఇతర పార్టీల నేతలు పాటించేసరికి కమలం నేతలకు కదలకుండా అవుతోంది. ఫలితం ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం పోతోంది. అన్నిచోట్ల ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ తో సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఇదే విధానాన్ని వ్యవహరించింది. కానీ అసోంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతోంది. ఇదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో అసోం ఒక్కటే బీజేపీకి గెలుస్తామనే ధీమా మొన్నటి వరకు ఉండేది..

    Also Read: వైరల్: ఆస్పత్రి బెడ్ పై నుంచి మమతా బెనర్జీ వీడియో సందేశం

    కానీ రానురాను అసోంలో కూడా బీజేపీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 64 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. గత ఎన్నకల్లో 86 స్థానాలను బీజేపీ కూటమి గెలుచుకుని అధికారంలోకి రాగలిగింది. అయితే అసోం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ నేతృత్వంలో ఐదేళ్ల పాటు సాగిన పాలన పట్ల ప్రజలు సంతృప్తికరంగా లేరు. మరోసారి అధికారంలోకి రావాలన్న బీజేపీకి సోనోవాల్ పాలన కూడా దెబ్బతీస్తోందన్న భావన వినిపిస్తుంది.

    ఇక అసోంలో కాంగ్రెస్ కూటమి రోజురోజుకు బలం పెంచుకుంటోంది. కాంగ్రెస్ తో పాటు ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కూటమికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. అందుకే బీజేపీ లబ్ధి పొందగలిగింది. కానీ ఈ సారి కాంగ్రెస్.. ఏఏయూడీఎఫ్ ల కూటమి పోటీ చేస్తుండడంతో అసోంలో బీజేపీ పప్పులు ఉడకడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: కేటీఆర్ ‘ఉక్కు’ సంక‌ల్పం.. ఏపీకి మద్దతు ఇందుకేనా?

    దీంతో పాటు అసోంలో మరోరెండు కొత్త ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. రాయిజోరి దళ్, అసోం జాతీయ పరిషత్ వంటి పార్టీలు అసోం గణ పరిషత్ కు నష్టం చేకూరుస్తాయని అంటున్నారు. బీజేపీ రోజురోజుకు బలహీన పడుతోంది. మిత్ర పక్షాలు సైతం హ్యాండ్ ఇస్తున్నాయి. బీజేపీ మిత్ర పక్షం బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ బీజేపీకి తలక్ చెప్పేసింది. తాము కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో చేరుతున్నట్లు ప్రకటించేసింది. దీంతో అసలే అసోంలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ ఆశలు మరింత అడుగునకు చేరుతున్నాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్