https://oktelugu.com/

అంతా నేనే చేయాలి.. అంతా నాకే కావాలి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా జానా తీరు ఇదీ..

పట్టులేని చోట గెలుపు కష్టమే అని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తమకు పట్టున్న చోటఅయినా విజయం సాధించాలని అనుకుంటోంది. ఎవరు వెంట వచ్చినా.. రాకున్నా.. గెలుపు తథ్యమని అభ్యర్థి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ముందే జానారెడ్డిని తమ అభ్యర్థిగా హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. జానారెడ్డి కూడా గత కొద్దికాలంగా ప్రచారాన్ని వేగవంతం చేశారు. కొద్ది వారాలుగా నాగార్జున సాగర్ లో […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 12, 2021 11:55 am
    Follow us on

    Jana reddy
    పట్టులేని చోట గెలుపు కష్టమే అని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తమకు పట్టున్న చోటఅయినా విజయం సాధించాలని అనుకుంటోంది. ఎవరు వెంట వచ్చినా.. రాకున్నా.. గెలుపు తథ్యమని అభ్యర్థి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ముందే జానారెడ్డిని తమ అభ్యర్థిగా హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. జానారెడ్డి కూడా గత కొద్దికాలంగా ప్రచారాన్ని వేగవంతం చేశారు. కొద్ది వారాలుగా నాగార్జున సాగర్ లో పర్యటిస్తూ.. గ్రూపు మీటింగులు పెడుతున్నారు. కులాల వారా.. గ్రామాల వారీగా.. అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉప ఎన్నికల సందర్భంగా దూకుడుగా వ్వవహరిస్తున్నారు. తన గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్న జానారెడ్డి ఆ క్రెడిట్ అంతా తనకే దక్కాలని భావిస్తున్నారు.

    Also Read: కేటీఆర్ ‘ఉక్కు’ సంక‌ల్పం.. ఏపీకి మద్దతు ఇందుకేనా?

    తన కొడుకు రఘువీర్ రెడ్డిపై ఆర్థికపరమైన భాధ్యతలను జానారెడ్డి పెట్టారు. ప్రచారం మొత్తం తానొక్కడినే చూసుకోవాలని నిర్ణయించారు. ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి జానారెడ్డి ప్రచారం చేయరు. ఎవరైనా పార్టీ రాష్ట్రస్థాయి నేతలు వచ్చినా.. వారితో ప్రత్యేకమైన సమావేశాలలు ఏర్పాటు చేస్తారు. నేతల సమావేశాల బాధ్యతలను జానారెడ్డి కుమారుడికి అప్పగించారు. దుబ్బాకలో జరిగినట్లుగా కాంగ్రెస్ నేతలను మండలాల వారీగా నియమించేందుకు జానారెడ్డి ఇష్టపడడం లేదు.

    నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తనకు నమ్మకమైన నేతలనే ఇన్చార్జీలుగా నియమించుకోవాలని జానారెడ్డి భావిస్తున్నారు. బయటి నుంచి వచ్చిన నేతలకు ఇన్చార్జీ బాధ్యతల అవకాశం ఇవ్వకూడాదని ఆయన పార్టీ హై కమాండ్ కు తెలిపారు. నాన్ లోకల్ అనే ముద్ర పడే అవకాశం ఉందని.. అధికార పార్టీ సానుభూతి పరంగా గెలవాలని చూస్తోందని.. అందుకే తనకే నమ్మకమైన వారినే మండలస్థయిలో ఇన్చార్జీలుగా నియమించుకుంటానని చెప్పనట్లు తెలిసింది.

    Also Read: వైరల్: ఆస్పత్రి బెడ్ పై నుంచి మమతా బెనర్జీ వీడియో సందేశం

    ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యనేతలను ఇన్చార్జీలుగా నియమిస్తే… సమన్వయం చేసుకోవడం కుదరదని కూడా జానారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం కూడా ఆర్భాటం లేకుండా చేయాలన్నది జానారెడ్డి ఉద్దేశం. ఇప్పటికే జానారెడ్డి నాగార్జున సాగర్ లోని అన్ని ప్రాంతాలు ఒక్కసారి చుట్టేసి వచ్చేశారు. తమ సమావేశాలకు మంచి స్పందన వస్తుండడంతో గెలుపు తప్పకుండా వరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ గెలుపు క్రెడిట్ తనకే దక్కాలని జానారెడ్డి భావిస్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్