ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో పట్టుబడిన రూ.5.25 కోట్ల నగదు విషయంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంటుండగా ఆ నగదు తనదేనంటూ ఒంగోలు చెందిన ఓ వ్యాపారస్తుడు ముందుకు వచ్చాడు. ఇతనిని ఆదాయపు పన్ను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నల్లమల్లి బాబు అనే ఈ వ్యాపారస్తుడు తమిళనాడులో సరుకు కోనుగొలు చేసేందుకు ఈ మొత్తాన్ని తరలిస్తుండగా పోలీసులు సోదా చేసి పట్టుకున్నారని చెప్పుకొచ్చారు. నగదుకు సంబంధించిన అన్ని పత్రాలు అధికారులకు చూపించి నగదు తీసుకుంటానని, ఈ విషయయంలో రాజకీయ నాయకులకు ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇంత వరకూ బాగానే ఉన్నా ఈ విషయంలో అనేక సందేహాలకు సమాధానం దొరకడం లేదు. వాహనానికి గిద్దలూరు ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు అంటించి ఉంది?.. సరుకు కొనుగోళ్లకు అంత పెద్దమొత్తం తలిస్తున్నారంటే పన్ను కట్టకుండా జిరో బిజినెస్ చేసేందుకేనా?.. సంబంధిత రాజకీయ నాయకులకు నల్లమల్లి బాబుకు మధ్య ఉన్న సంబంధాలు ఏంటి?.. అనే విషయంలో ఎన్నో ఫ్రశ్నలు వేధిస్తున్నాయి. ఏ సంబంధం లేకపోతే ఎమ్మెల్యే స్టిక్కర్ ఇతనికి ఎందుకు చేరిందనేది ఒక అంశం.
చినబాబుకు జగన్ పెద్ద స్కెచ్..!
నగదు వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా టిడిపి, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మంత్రి బాలినేని కుమారుడు నగదు తరలిస్తున్నాడని టిడిపి నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంత్రిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి బాలినేని సరిహద్దు దాటిస్తున్న నగదులో అవినీతి చక్రవర్తి జగన్ వాటా ఎంతా అంటూ టిడిపి విమర్శలు చేస్తూ ట్విట్ లు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టిడిపి పోస్టులపై సమాధానమిస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. మరోవైపు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిష్టను మంటగలిపేందుకే సోషల్ మీడియాలో కొందురు అసత్యప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా పోస్టులపై పలువురిని అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ ఫిర్యాదుపై పోలీసులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేసే అవకాశం లేకపోలేదు.
మరోవైపు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదుకు తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ నగదు తరలింపు వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.