https://oktelugu.com/

ఈ దెబ్బతో జగన్ బీజేపీతో కలుస్తాడా?

కేంద్రంలో మంత్రి పదవుల తంతు నడుస్తోంది. దీంతో ఏపీలో ఇద్దరి వైసీపీ నేతలకు మంత్రి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో భేటీ అయిన ప్రతి సందర్భంలోనూ, ఇక ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. కేంద్రంతో వైసీపీ ప్రభుత్వం ముందు నుంచి సత్సంబంధాలనే కొనసాగిస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినా, వైసీపీ పెద్దగా కౌంటర్ అటాక్‌ చేయడం లేదు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 16, 2020 / 09:05 PM IST
    Follow us on


    కేంద్రంలో మంత్రి పదవుల తంతు నడుస్తోంది. దీంతో ఏపీలో ఇద్దరి వైసీపీ నేతలకు మంత్రి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో భేటీ అయిన ప్రతి సందర్భంలోనూ, ఇక ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. కేంద్రంతో వైసీపీ ప్రభుత్వం ముందు నుంచి సత్సంబంధాలనే కొనసాగిస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినా, వైసీపీ పెద్దగా కౌంటర్ అటాక్‌ చేయడం లేదు. లోక్‌ సభ, రాజ్యసభల్లోనూ బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తూనే వుంది. లోక్‌ సభలో వైసీపీకి 22 మంది ఎంపీల బలం ఉంది. ఇటు రాజ్యసభలోనూ తాజా గెలుపుతో సభ్యుల సంఖ్య రెండు నుంచి ఒక్కసారిగా ఆరుకు పెరిగింది. దీంతో వైసీపీతో అధికారికంగా చేతులు కలిపేందుకు బీజేపీ పెద్దలు ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం.

    అయితే జగన్ మాత్రం బీజేపీతో చేతులు కలపటానికి సుముఖంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి వైసీపీ గెలుపు పునాదులు దళితులు, మైనార్టీ ఓట్‌ బ్యాంక్‌ పైనే ఉన్నాయి. సామాజికంగా ఈ రెండు వర్గాలకు బీజేపీ అంటే వ్యతిరేక అభిప్రాయం ఉండటంతో, రాష్టంలో రాజకీయంగా నష్టం కనుక, ఆ పని జగన్ చెయ్యడం లేదనేది పార్టీ నేతల మాటలు. దీంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఎవరితోనైనా చేతులు కలపటానికి సిద్ధమని, గతంలో అనేక సందర్భాల్లో జగన్‌ స్వయంగా ప్రకటించారు. ప్రత్యేక హోదాపై ఎటువంటి భరోసా లేకుండా బీజేపీతో కలిస్తే అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందన్నది ఒక వాదన. అందుకే కాషాయంతో చేతులు కలపడం ఎందుకన్నది జగన్ ఆలోచన కావొచ్చు.