Operation Sindoor: కానీ వాస్తవం మాత్రం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఉగ్రవాద దేశానికి సొంతంగా ఆయుధాలను తయారు చేసుకునే సన్నివేశం లేదు. ప్రతిదానికి కూడా ఇతర దేశాలపై ఆధార పడటమే. అమెరికా దగ్గరకు రానివ్వదు. రష్యా అసలు దేకదు. యూరప్ దేశాలు పోపోమంటాయి. ఇలాంటి అప్పుడు ఆ దిక్కుమాలిన చైనా.. నెత్తి మాసిన ఉత్తరకొరియా.. పనికిమాలిన తుర్కియో మాత్రమే ఉగ్రవాద దేశానికి ఆయుధాలు అందిస్తున్నాయి. ఆ ఆయుధాలు అంతంతమాత్రంగానే పనిచేస్తున్నాయి. తాజాగా మనపై చేసిన దాడిలో ఉగ్రవాద దేశానికి అది అనుభవంలోకి వచ్చింది. మనపై ప్రయోగించిన మిసైల్స్ ఏమాత్రం పనిచేయకపోవడంతో ఉగ్రవాద దేశానికి తలనొప్పిగా మారింది. వందల కోట్లు ఖర్చుపెట్టి ఆ స్థాయిలో ఆయుధాలు కొనుగోలు చేస్తే.. అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి.
Also Read: స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే!
మనవాళ్ళు పేల్చేశారు
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఉగ్రవాద దేశం నుంచి మన మీదికి ప్రయోగించిన మిస్సైల్ ఒకటి పేలింది. ఇకపోతే దానిని పేల్చింది మనవాళ్లు. ఉగ్రవాద దేశం ప్రయోగించగా పేలకుండా ఉన్న మిస్సైల్ ను స్థానికులు తీసుకొచ్చి నిర్మానుష్య ప్రదేశంలో ఉంచారు. ఒక కర్రకు నిప్పు అంటించి.. దాన్ని కాల్చారు. అది కాస్త నిప్పులు చిమ్ముకుంటూ ఢాం అని పేలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.” ఆయుధాలు చేసుకోలేరు. కనీసం ఆయుధాలను వాడలేరు. చివరికి మిసైల్స్ కూడా పేల్చలేరు. ఇంతోటి దానికి మీకు వార్ ఎందుకు.. ఇండియా లాంటి పవర్ఫుల్ కంట్రీ తో పోలిక ఎందుకు.. ఇంతకంటే ఇజ్జత్ తక్కువ పని మరొకటి ఉండదు అంటూ” సోషల్ మీడియాలో నెటిజన్లు ఉగ్రవాద దేశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నట్టు దీని పేల్చే సమయంలో స్థానికులు ఏమాత్రం భయపడలేదు. మరోవైపు ఇటీవల లభించిన ఒక మిస్సైల్ ను స్థానికులు గుర్తించి.. దానితో ఆటలాడుకోవడం విశేషం.
నాణ్యత లేదు
ఉగ్రవాద దేశానికి ఇతర దేశాలు ఇచ్చిన ఆయుధ సామాగ్రిలో ఏమాత్రం నాణ్యత లేదు. పైగా అది దీపావళి బాంబుల కంటే దారుణంగా తుస్సుమన్నాయి. అవి ఏమాత్రం పని చేయకపోవడం ఉగ్రవాద దేశం ఇజ్జత్ మొత్తం పోయింది. వందల కోట్లు ఖర్చుపెడితే ఇలాంటి ఆయుధ సామాగ్రి వచ్చిందా అంటూ అక్కడి ఆపోజిషన్ పార్టీలు విమర్శించడం మొదలుపెట్టాయి. భారీగానే ఇందులో అవకతవతలు చోటుచేసుకుని ఉంటాయని అక్కడి ఆపోజిషన్ పార్టీలు అనుమానిస్తున్నాయి. “భారీగా ఖర్చు పెట్టామని లెక్కలు మాత్రమే చెప్పారు. కానీ ఆయుధ సామాగ్రి విషయంలో అవినీతికి పాల్పడ్డారని దీని ద్వారా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ప్రపంచ దేశాల ముందు ఇజ్జత్ మొత్తం పోయింది. ఇక ఇంతకంటే దారుణం మరొకటి ఏముంటుందని” సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
View this post on Instagram