Hero Vishal
Hero Vishal: తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరో విశాల్, ఈమధ్య కాలం లో ఎక్కువగా అస్వస్థతతో కనిపించడం ఆయన అభిమానులను తీవరమైన ఆందోనళకు గురి చేసింది. గత ఏడాది ‘మదగజరాజ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశాల్ మాట్లాడుతున్నప్పుడు ఆయన చేతులు వణికిపోవడాన్ని గమనించి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాల్ ఎందుకు ఇలా అయిపోయాడు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటూ అప్పట్లో పెద్ద చర్చనే నడిచింది. విశాల్ తీవ్రమైన జ్వరం తో బాధపడుతున్నాడని, అందుకే ఆయన అలా వణికిపోయాడంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కోలుకున్నాక అంతా నార్మల్ గానే ఉన్నింది. ఇప్పుడు మరోసారి విశాల్ స్టేజి మీద స్పృహ తప్పి పడిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read: మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?
పూర్తి వివరాల్లోకి వెళ్తే విశాల్ తమిళనాడులోని విల్లుపురం లో జరిగిన మిస్ విల్లూపురం ట్రాన్స్ జెండర్ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ పోటీలకు మాజీ మంత్రి పొన్ముది కూడా మరో అతిథిగా విచ్చేశాడు. స్టేజి మీద కొంతమంది ట్రాన్స్ జెండెర్లు విశాల్ తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ తమ స్టైల్ లో ఆయన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. విశాల్ కూడా నవ్వుతూ వాళ్ళ అస్వీర్వాదాన్ని స్వీకరించారు. ఎంతో మందికి ఆయన సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు కూడా ఇచ్చాడు. అలా చాలా యాక్టీవ్ గా కనిపించిన విశాల్ కి సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ, స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా అక్కడికి వచ్చిన వాళ్లంతా షాక్ కి గురయ్యారు. వెంటనే విశాల్ ని చికిత్స కోసం దగ్గర్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. అధికారికంగా డాక్టర్ల నుండి ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల అవ్వలేదు. విశాల్ మ్యానేజర్ మాట్లాడుతూ ‘ఈమధ్య కాలంలో విశాల్ సరిగా భోజనం తినడం లేదు. బాగా బలహీనపడ్డాడు. అందుకే అస్వస్థతకు గురి అయ్యి ఉంటాడని అనుకుంటున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. సరైన స్పష్టత రాకపోవడం తో తమ అభిమాన హీరో ఎలా ఉన్నాడో ఏంటో అని అభిమానులు సోషల్ మీడియా లో కంగారు పడుతున్నారు. ఇకపోతే విశాల్ హీరో గా నటించిన ‘మదగజరాజా’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు విడుదలైంది. ప్రస్తుతం ఆయన ‘డిటెక్టివ్’ సీక్వెల్ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి స్వయంగా ఆయన దర్శకత్వం కూడా వహిస్తుండడం విశేషం.
கூட்டத்தில் மயங்கி விழுந்த விஷால்… விழுப்புரத்தில் பரபரப்பு#vishal | #thanthicinema | #villupuram pic.twitter.com/DgrXSOv9FU
— Thanthi TV (@ThanthiTV) May 11, 2025
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Hero vishal collapses on stage