Operation sindoor : పాకిస్తాన్ పాల్పడిన దాడులను భారత్ అత్యంత తెలివిగా తిప్పికొట్టింది. కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది. బుధవారం తెల్లవారుజామున టెర్రరిస్టుల క్యాంపులు టార్గెట్ గా అటాక్ మొదలుపెట్టిన భారత్.. ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ ను మరింత విస్తరించింది. ఇందులో దాదాపు 100 మంది టెర్రరిస్టులను చంపేసింది. దీనిని పాకిస్తాన్ తీవ్రంగా పరిగణించింది. ఉగ్రవాదులను తమ దేశ సైనికుల కంటే ఎక్కువ భావించి.. వారికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. అంతేకాదు భారత్ పై దాడులు ప్రారంభించింది. మనదేశంలో 15 నగరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడానికి ప్రణాళిక రూపొందించింది. అయితే వాటిని మధ్యలోనే భారత సైన్యం పేల్చేసింది. ఈ క్రమంలోనే దాయాది పాకిస్తాన్ దేశానికి సరైన బుద్ధి చెప్పడానికి నావికాదళం ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగానే కరాచీ నౌకాశ్రయం పై క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో కరాచీ నౌకాశ్రయం పూర్తిగా దెబ్బతిన్నది. దీనికి సంబంధించిన వీడియోలను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. తన ట్విట్టర్ అకౌంట్ లో వాటిని అందుబాటులో ఉంచారు.. ఒక పోస్టులో కరాచీ పోర్టు ధ్వంసం అవుతున్న తీరును ఆయన షేర్ చేశారు..” ఇప్పటికందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కరాచీ నౌకాశ్రయం పూర్తిగా ధ్వంసం అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాలని” ఆయన పోస్ట్ చేశారు.
Also Read : అంతర్జాతీయ మీడియా లైవ్ లో పాక్ ఇజ్జత్ తీసిన రక్షణ మంత్రి! వైరల్ వీడియో
పాకిస్తాన్లో దీపావళి పండగ
శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో అజిత్ దోబల్ మరో కీలకమైన వీడియో పోస్ట్ చేశారు. “పాకిస్తాన్లో దీపావళి పండుగ జరుగుతోందని” అందులో వ్యాఖ్యానించారు. ఇక ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ” భారత్ అనేది శక్తివంతమైన దేశం. భారత్ తో పెట్టుకుంటే పాకిస్తాన్ పరిస్థితి అద్వానంగా మారుతుంది. ఇప్పటికే అత్యంత దరిద్రంగా ఉంది. పాకిస్తాన్ లో దీపావళి ఇంత ఘనంగా చేస్తారని అసలు ఊహించలేదు. చూసి ఎందుకు ఇది చాలా బాగుంది. ప్రారంభం అదిరిపోయింది. ముగింపు మరి ఇంత ఘనంగా జరగాలి..ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్ ఉంది.. మన దేశంలో చేసిన దాడులకు.. తీసిన ప్రాణాలకు పాకిస్తాన్ అంతకంతకు అనుభవించాలి. ప్రపంచ పటంలోనే ఆ దేశం అనేది ఉండకూడదు. ఉగ్రవాదానికి పట్టుకొమ్మలాగా ఉన్న ఆ దిక్కుమాలిన దేశం ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలి. ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలి.. అప్పుడే పాకిస్తాన్ బాగుంటుంది.. అంతకంటే ముందు భారత్ బాగుంటుంది.. ప్రపంచం మొత్తం శాంతితో వర్ధిల్లుతుందని” సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు.
Diwali in Pakistan pic.twitter.com/JFYU3n1xvc
— Ajit Doval ᴾᵃʳᵒᵈʸ (@IAjitDoval_IND) May 8, 2025
