Homeఎంటర్టైన్మెంట్Shubham Twitter Review : శుభం ట్విట్టర్ రివ్యూ: ఫుల్ ఫన్ రైడ్, సమంత మూవీ...

Shubham Twitter Review : శుభం ట్విట్టర్ రివ్యూ: ఫుల్ ఫన్ రైడ్, సమంత మూవీ ఎలా ఉందంటే?

Shubham Twitter Review : హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటించగా ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన చిత్రం శుభం. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన సమంత, మొదటి ప్రయత్నంగా శుభం చిత్రం నిర్మించింది. సమంత గెస్ట్ రోల్ చేసింది. శుభం మూవీ నేడు థియేటర్స్ లోకి వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్స్ ముగిశాయి. దాంతో ఆడియన్స్ శుభం మూవీ ఎలా ఉందో ట్విట్టర్ ఎక్స్ వేదికగా పంచుకుంటున్నారు.

శుభం మూవీ కథ విషయానికి వస్తే.. ఇది 2000 నాటి కథ. భీమిలిలో కేబుల్ టీవీ ఆపరేటర్ అయిన శ్రీనివాస్(హర్షిత్)శ్రీవల్లి(శ్రియ)ను వివాహం చేసుకుంటాడు. మొదటిరాత్రి రోజు సరిగ్గా 9 గంటలకు ఓ సీరియల్ చూసిన శ్రీవల్లికి దయ్యం పడుతుంది. దాంతో శ్రీనివాస్ కి కష్టాలు మొదలు అవుతాయి. మరి శ్రీవల్లిని దయ్యం ఎలా వదిలింది? వారి తతంగం ఎలా సాగింది? అనేది కథ.

ఫ్యామిలీ డ్రామాను దర్శకుడు ప్రవీణ్ ఆద్యంతం ఆసక్తికరంగా నడపడంలో సక్సెస్ అయ్యాడు, అని సినిమా చూసిన ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆడవాళ్ళ సీరియల్ పిచ్చి నేపథ్యంలో రాసుకున్న కథ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మహిళలు శుభం సినిమాను బాగా ఇష్టపడతారు. సమంత గెస్ట్ అప్పీరెన్స్ ప్లస్ అని చెప్పాలి. కొత్త నటులు అయినప్పటికీ హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి బాగా నటించి మెప్పించారు. కామెడీ పండించడంలో సక్సెస్ అయ్యారని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

నిర్మాతగా సమంత సక్సెస్ అయ్యారు. ఆమె మొదటి ప్రయత్నం శుభం మంచి ఫలితం ఇచ్చింది. వివేక్ సాగర్ నేపద్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సైతం మెప్పిస్తాయి. మొత్తంగా ఈ వారం శుభం మంచి ఛాయిస్. కామెడీ మూవీ లవర్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతారు.

Exit mobile version