Thummala Nageswara Rao: రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మర్చిపోకముందే.. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక విషయాలను చెప్పారు. ” పుస్త పథకాలను అర్హులకే ఇవ్వాలి. మూడు రూపాయల బియ్యాన్ని రెండు రూపాయల వరకు ఇస్తే పెద్దగా ఇబ్బంది లేదు. కానీ 60 రూపాయల బియ్యాన్ని ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాలు కోటి పది లక్షల వరకు ఉంటే.. రేషన్ కార్డులు ఏకంగా కోటిపాతిక లక్షలు దాటిపోయాయి.. ఇలాంటి స్థితిలో ప్రభుత్వం మీద ఆర్థిక భారం అంతకంతకు పెరిగిపోతున్నది. దీనివల్ల అత్యవసర పనులకు కూడా నిధులు కేటాయించిన దుస్థితి నెలకొంటున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం కొన్ని పథకాలను సమీక్షించుకోవాలి. సాధ్యమైనంతవరకు దుబారా ఖర్చును తగ్గించుకోవాలని” తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు..
Also Read: పాకిస్థాన్‌పై దాడికి భారత్ వ్యూహం.. కీలక స్థావరం గుర్తింపు!
ప్రభుత్వానికి సోయి ఉందా
దొంగ రేషన్ కార్డుల గురించి.. ప్రభుత్వం భారీగా ఖర్చుపెట్టి ఇస్తున్న రేషన్ బియ్యం గురించి గొప్ప గొప్ప వ్యాఖ్యలు చేసిన తుమ్మల నాగేశ్వరరావు.. అసలు విషయాన్ని మర్చిపోయారు. దొంగ రేషన్ కార్డులు ఆ స్థాయిలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఏరివేయడం లేదు? పైగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెబుతోంది కదా? ఆ రేషన్ కార్డులను ఎందుకు ఇస్తున్నారు? దానిని ఎన్నికల మేనిఫెస్టోగా ఎందుకు ప్రకటించారు? అంటే ప్రతి ప్రభుత్వ పథకానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నప్పుడు.. ఇలాంటి దొంగ కార్డులు ఎందుకు పుట్టుక రావు.. ఇలాంటి స్థితిలో ప్రభుత్వానికి ఎలాంటి సోయి ఉంది? దీనినే చమకభారతను అంటారు.. పథకాల మీద సమీక్ష.. ఉద్యోగులకు చెల్లిస్తున్న చెల్లింపుల్లో కత్తెర.. రేషన్ కార్డుల ప్రక్షాళన చేయడం మీ వల్ల కాదు.. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ… అధికారంలోకి రాకముందు కొన్ని వందల హామీలు ఇచ్చింది. ఇప్పుడు అమలు చేయాలంటే కళ్ళు తేలేస్తోంది. ఇలాంటి పలాయన వాదాన్ని చూస్తూ ఉండి కూడా తుమ్మల నాగేశ్వరరావు అలా మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం. అన్నట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు యావత్ దేశానికి కావాల్సింది రాజనీతిజ్ఞులు.. అయితే గౌరవ భారత సమాజం చేసుకున్న దురదృష్టం వల్ల వారు ఇప్పుడు లేరు. ఉన్న వెలుగులోకి రానివ్వరు. అవకాశాలు ఇవ్వరు. అన్నట్టు ఇదే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా విషయంలో.. అనేక సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు.. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. సంక్షేమం అంటే ఉచితమే కదా.. రైతు భరోసా పథకం కింద ఎంతమంది అర్హులైన రైతులకు ఇస్తున్నారు.. అందులో ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు.. ఇవీ డిబేటబుల్ ప్రశ్నలు.. వీటికి తుమ్మల నాగేశ్వరరావు సమాధానం చెప్పలేరు. చెప్పే అవకాశం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవ్వరు. ఎందుకంటే వారికి కావాల్సింది అధికారం మాత్రమే. జనం ఎలా చస్తే ఏంటి.
Also Read: విజయవాడ టు విశాఖ.. జూన్ 1 నుంచి విమాన సేవలు!