https://oktelugu.com/

ఓల్డ్ మలక్ పేటలో కొనసాగుతున్న రీ పోలింగ్.. సాయంత్రం వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్..!

జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల స్థానాలకుగాను డిసెంబర్ 1న పోలింగ్ జరిగింది. అయితే ఓల్డ్ మలక్ పేటలో సీపీఎం, సీపీఐ గుర్తులు తారుమారు కావడంతో ఇక్కడ ఎన్నికను వాయిదా వేశారు. డిసెంబర్ 3న ఓల్డ్ మలక్ పేట డివిజన్లో పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో నేడు ఓల్డ్ మలక్ పేట స్థానానికి ఎన్నిక జరుగుతోంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగనుంది. Also Read: టీఆర్ఎస్ గెలిస్తే మేయర్ పీఠం రెడ్డిలకే? ఆమెనా? […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 3, 2020 / 10:27 AM IST
    Follow us on

    జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల స్థానాలకుగాను డిసెంబర్ 1న పోలింగ్ జరిగింది. అయితే ఓల్డ్ మలక్ పేటలో సీపీఎం, సీపీఐ గుర్తులు తారుమారు కావడంతో ఇక్కడ ఎన్నికను వాయిదా వేశారు. డిసెంబర్ 3న ఓల్డ్ మలక్ పేట డివిజన్లో పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో నేడు ఓల్డ్ మలక్ పేట స్థానానికి ఎన్నిక జరుగుతోంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

    Also Read: టీఆర్ఎస్ గెలిస్తే మేయర్ పీఠం రెడ్డిలకే? ఆమెనా?

    ఓల్డ్ మలక్ పేటలో మొత్తం 54,655మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 27,889.. మహిళలు 26,763.. ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఈ డివిజన్ పరిధిలోని 69పోలింగ్ స్టేషన్లు ఉండగా 12మంది మైక్రో అబ్జర్వర్లను ఎన్నికల సంఘం నియమించింది. ఈ ఎన్నిక కోసం 23 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6గంటల వరకు క్యూ లైన్లోలో ఉన్నవారందరికీ ఓటుహక్కును కల్పించనున్నారు.

    ఓల్డ్ మలక్ పేట్ రీ పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎగ్జిట్స్ పోల్స్ ను గురువారం సాయంత్రం వరకు వాయిదా వేసిన సంగతి తెల్సిందే. నేటి సాయంత్రం 6గంటల వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని స్థానాలకు ఎన్నిక పూర్తి కానున్నాయి. దీంతో సాయంత్రం 5గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశాలున్నాయి.

    Also Read: గ్రేటర్లో పోలింగ్ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసా?

    ఎగ్జిట్స్ పోల్స్ సాయంత్రం రానుండటంతో ఏ పార్టీ మేయర్ పీఠం రేసులో ముందుందో స్పష్టత రానుంది. గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. దీంతో నగరవాసులు ఏ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేశారనేది ఆసక్తికరంగా మారింది. రేపు తుది ఫలితాలు రానుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఈసారి బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు లెక్కించాల్సి ఉండటంతో రాత్రి వరకు కౌంటింగ్ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్