టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు.. భావి టీడీపీ వారసుడు నారా లోకేష్ కు రాజకీయం బాగానే వంటబట్టినట్టు ఉంది. లేకుంటే ఇంత బాగా ప్రజల్లో తిరగడం ఏంటి? ప్రజలను ఆకర్షించేలా నిరసనలు చేయడం ఏంటి? గత చంద్రబాబు ప్రభుత్వంలో కొంచెం నార్మల్ గా స్తబ్దుగా ఉన్న లోకేష్ బాబు ఇప్పుడు మాత్రం నాన్న చంద్రబాబుకు ధీటుగా ముందుకెళుతున్నారు. ఆయన వారసుడిగా అంతే తీవ్రతతో వెళుతున్నారు.
Also Read: ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఆధార్ ఉంటేనే రేషన్ సరుకులు..?
తండ్రికి తగ్గ తనయుడు కాదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో నారా లోకేష్ గేరు మార్చేశారు. చంద్రబాబు అసెంబ్లీలో బైటాయిస్తే ఇప్పుడు నారా లోకేష్ మండలిలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల నాలుగోరోజు నారా లోకేష్ ఆశ్చర్యపరిచాడు. గురువారం అసెంబ్లీ దగ్గర ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. అసెంబ్లీకి కాలినడకన వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీ పాలనలో వివిధ వర్గాలపై దాడులు, అసెంబ్లీలోకి కొన్ని మీడియా సంస్థలను అనుమతించకపోవడంతో సంకెళ్లు, నల్ల కండువాలతో నిరసన తెలిపారు.
Also Read: జగన్ కు బీజేపీ భారీ షాక్.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి ఫిర్యాదు
ఈ క్రమంలోనే తమ అనుకూల టీడీపీ మీడియాను అసెంబ్లీలో జగన్ నిషేధం విధించినందుకు నిరసనగా లోకేష్ బాబు చేతికి నల్ల కండువాలతో సంకెళ్లు వేసుకొని వినూత్నంగా నిరసన తెలుపడం విశేషం. ఈ లుక్ చూశాక.. లోకేష్ బాబు కూడా రాజకీయం వంట బట్టించుకున్నాడని టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్