https://oktelugu.com/

ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఆధార్ ఉంటేనే రేషన్ సరుకులు..?

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులకు ఆధార్ కార్డు నంబర్ ను నమోదు చేస్తే మాత్రమే రేషన్ సరుకులు పొందే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటివరకు ఆధార్ నంబర్ నమోదు చేసినా చేయకపోయినా రేషన్ సరుకుల పంపిణీ జరిగింది. చాలా నెలల క్రితమే రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ ను జత చేసే ప్రక్రియ మొదలైనా చాలామంది ఇప్పటికీ రేషన్ కార్డుతో ఆధార్ నంబర్ ను లింక్ చేయించుకోలేదు. Also Read: ఓల్డ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 3, 2020 / 10:16 AM IST
    Follow us on


    తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులకు ఆధార్ కార్డు నంబర్ ను నమోదు చేస్తే మాత్రమే రేషన్ సరుకులు పొందే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటివరకు ఆధార్ నంబర్ నమోదు చేసినా చేయకపోయినా రేషన్ సరుకుల పంపిణీ జరిగింది. చాలా నెలల క్రితమే రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ ను జత చేసే ప్రక్రియ మొదలైనా చాలామంది ఇప్పటికీ రేషన్ కార్డుతో ఆధార్ నంబర్ ను లింక్ చేయించుకోలేదు.

    Also Read: ఓల్డ్ మలక్ పేటలో కొనసాగుతున్న రీ పోలింగ్.. సాయంత్రం వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్..!

    రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ ను లింక్ చేయడం ద్వారా అక్రమాలను సులభంగా అరికట్టవచ్చని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. ఇకపై రాష్ట్రంలో రేషన్ సరుకులను పొందాలంటే ఆధార్ నంబర్ ను ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సి ఉంది. పౌరసరఫరాల శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి అనిల్ కుమార్ నుంచి నిన్న ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పౌర సరఫరాల శాఖ అధికారులు రాష్ట్రంలో చాలామంది రేషన్ దుకాణాల్లో ఆధార్ నంబర్ ను నమోదు చేసుకున్నారని తెలిపారు.

    Also Read: అతివిశ్వాసమా.. మొండి తనమా..?

    కొంతమంది మాత్రం నమోదు చేయించుకోలేదని వాళ్లు నంబర్ ను లింక్ చేయించుకుంటే సులభంగా సరుకులు పొందవచ్చని వెల్లడించారు. రేషన్ దుకాణాల్లో ఆధార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన వారు మాత్రమే సరుకులను పొందే అవకాశాలు ఉంటాయి. బయోమెట్రిక్, ఐరిష్‌ నిర్ధారణల ద్వారా ఆధార్ వివరాలను నమోదు చేయనున్నారు. ఈ రెండు విధానాల వల్ల వివరాల నమోదు సాధ్యం కాకపోతే వన్‌టైం పాస్‌వర్డ్‌ ద్వారా లావాదేవీలను పూర్తి చేయవచ్చు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఏవైనా అనారోగ్య సమస్యలు ఉండి ఆ కారణాల వల్ల ఆధార్ నమోదు సాధ్యం కాకపోతే వారికి మాత్రం యథాతథంగా రేషన్ పంపిణీ జరగనుంది. అధికారులు లబ్ధిదారుల ఆధార్ వివరాలను నమోదు చేసుకోవడం కోసం యూఐడీఏఐ అధికారులతో కలిసి సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.