https://oktelugu.com/

కేసీఆర్ కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరో సెంటిమెంట్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కేసీ‘ఆరు’ పేరులోనే 6 అనే సంఖ్య ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ఆయన ఏ పని మొదలెట్టినా ఆ సంఖ్య వచ్చేలా చూసుకుంటారు. కేసీఆర్ కు తొలి నుంచి జ్యోతిష్యం, న్యూమరాలజీ, ఆధ్యాత్మికంపై మంచి నమ్మకం ఉంది. వీటి ప్రకారం ఆయన ముహుర్తాలు చేసుకుంటూ పనులు చేస్తుంటారు. ముఖ్యంగా ఆరు అంకె కలిసొచ్చేలా పనులు చేపడుతుంటారు. ఆరు అంకె ఆయనకు కలిసొస్తుండటంతో కేసీఆర్ కు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 3, 2020 / 08:11 PM IST
    Follow us on


    తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరో సెంటిమెంట్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కేసీ‘ఆరు’ పేరులోనే 6 అనే సంఖ్య ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ఆయన ఏ పని మొదలెట్టినా ఆ సంఖ్య వచ్చేలా చూసుకుంటారు. కేసీఆర్ కు తొలి నుంచి జ్యోతిష్యం, న్యూమరాలజీ, ఆధ్యాత్మికంపై మంచి నమ్మకం ఉంది. వీటి ప్రకారం ఆయన ముహుర్తాలు చేసుకుంటూ పనులు చేస్తుంటారు. ముఖ్యంగా ఆరు అంకె కలిసొచ్చేలా పనులు చేపడుతుంటారు. ఆరు అంకె ఆయనకు కలిసొస్తుండటంతో కేసీఆర్ కు అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. ఈ సెంటిమెంట్ ను ఆయన తన కుటుంబానికి కూడా వర్తింపజేస్తుండటం ఆసక్తిని రేపుతోంది.

    Also Read: కొత్త తెలంగాణ పీసీసీ చీఫ్ కు అదే అడ్డు?

    కేసీఆర్ కుటుంబానికి చెందిన మరో వ్యక్తి రాజకీయాల్లోకి రానున్నారని టీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే సదరు వ్యక్తి గత కొద్దిరోజులుగా ప్రగతి భవన్ కి వచ్చిపోతున్నారనని సమాచారం. కేసీఆర్ తో కలిసి ఇప్పటికే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ కుటుంబం నుంచి ఐదుగురు వ్యక్తులు టీఆర్ఎస్ క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో కేసీఆర్ మరొకరిని కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారనే టాక్ విన్పిస్తుంది. కేసీఆర్ ఆరో సెంటిమెంట్ కు అనుగుణంగా తెరపైకి మరొకరు రానున్నట్లు తెలుస్తోంది.

    సీఎం కేసీఆర్ తో కలిపి ఆయన కుటుంబం నుంచి ఐదుగురు రాజకీయాల్లో ఉన్నారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన తనయుడు కేటీఆర్ ఐటీశాఖ మంత్రిగా ఉన్నారు. ఇక ఆయన మేనల్లుడు హరీష్ రావు ఆర్థిక మంత్రిగా, కూతురు కవిత ఎమ్మెల్సీగా, సోదరుడి కుమారుడు సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తాజాగా మరో పేరు తెరపైకి రావడంతో కేసీఆర్ కుటుంబం నుంచి ఆరో వ్యక్తి రానున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది.

    Also Read: జల వివాదాల పరిష్కారంపై ముఖం చాటేస్తున్న కేసీఆర్

    కేసీఆర్ ల‌క్కీ నెంబ‌ర్ ఆరుకు తగ్గట్టే అన్ని వ్యవహారాలు సాగుతుంటాయి. ఆయన వాడే కాన్వాయ్ నెంబరు నుంచి ప్రతీ విషయంలోనూ 6 అనే అంకె ముడిపడేలా చూసుకుంటుంటారు. చివరికి తెలంగాణ కొత్త సచివాలయం కూడా ఆరు అంతస్తుల్లో 6లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్నారట. తాజాగా ఈ ఆరో సెంటిమెంట్ కుటుంబానికి కూడా వర్తించనుందని సమాచారం. త‌న‌ సోదరుడి కుమారుడైన‌ వంశీని త్వరలోనే పార్టీలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వంశీ ఇటీవల త‌రచూ ప్రగతి భ‌వ‌న్లో కన్పిస్తుండటంతో ఆయన ఎంట్రీ కన్ఫామ్ అనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై సీఎం కేసీఆర్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సిందే..!