https://oktelugu.com/

జగన్ భాద్యత వహిస్తాడా ?

శుక్రవారం నాడు గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదముద్ర వేయడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి , శుక్రవారం రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు అని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు.అన్ని రాజకీయ పార్టీలు గవర్నర్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. కానీ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల వలన అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి అని వాదిస్తుంది. Also Read: రాజధాని రైతుల కల నెరవేరుతుందా? రాష్ట్ర విభజన తరువాత అమరావతి రాజధానిగా నవ్యఆంధ్రప్రదేశ్ ఏర్పడింది , […]

Written By:
  • admin
  • , Updated On : August 3, 2020 / 07:37 PM IST
    Follow us on


    శుక్రవారం నాడు గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదముద్ర వేయడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి , శుక్రవారం రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు అని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు.అన్ని రాజకీయ పార్టీలు గవర్నర్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. కానీ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల వలన అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి అని వాదిస్తుంది.

    Also Read: రాజధాని రైతుల కల నెరవేరుతుందా?

    రాష్ట్ర విభజన తరువాత అమరావతి రాజధానిగా నవ్యఆంధ్రప్రదేశ్ ఏర్పడింది , అప్పటి ప్రభుత్వం వేలాది ఎకరాలు రైతుల నుండి సేకరించింది . అక్కడి ప్రజలు తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఎన్నో ఆశలతో మూడు పంటలు పండే భూమిని ప్రభుత్వానికి సమర్పించుకున్నారు, కానీ నేడు వారి ఆశలు అన్ని ఆవిరైపోయాయి , సవంత్సరం కాలంగా అమరావతి రైతులు రాజధాని కోసం పోరాడుతూనేవున్నారు ,ఐనా గవర్నర్ ఇవేమి పట్టించుకోకుండా మూడు రాజధానులకు ఆమోద ముద్ర వేశారు.

    ఇది ఇలా ఉంటే తెరపైకి మరో ఆసక్తికర వాదన వచ్చింది, ఆ వాదన ప్రకారం రాజధాని అమరావతిలోని ఉంటే ఒకే సామజిక వర్గానికి లాభం చేకూరుతుంది, ఆలా ఆ సామజిక వర్గం బలపడితే ప్రస్తుత ప్రభుత్వానికి రాజధాని ప్రాంతంలో పట్టు ఉండదు, ఎలాగైనా రాజధాని ప్రాంతంలో తన ఉనికిని కాపాడుకోవడానికి జగన్ అండ్ కో ఇలా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి, మూడు రాజధానులు సాధించుకున్నారని కొందరు అంటున్నారు.

    Also Read: రాజధాని రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఆఫర్ ఇదేనా?

    ప్రపంచంలో ఏ దేశానికి మూడు రాజధానులు లేవు , మరి ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు మూడు రాజధానులు అంటే రాయలసీమ , కోస్తాంధ్ర , ఉత్తరాంధ్ర సమానంగా అభివృద్ధి సాధించాలంటే మూడు రాజధానులు అవసరం అని ప్రభుత్వం వాదిస్తోంది . వాస్తవంగా ఒక ప్రాంతం అభివృద్ధి సాధించాలంటే ప్రవేటు పెట్టుబడులు చాల అవసరం, ఆ పెట్టుబడుల వలన అనేక పరిశ్రమలు వచ్చి , ఉపాధి అవకాశాలు పెరిగి ఆ ప్రాంతం అభివృద్ధి సాధిస్తుంది.అంతే కానీ మూడు రాజధానుల వలన కాదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
    ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అధికారంలో వుంది , భవిష్యత్తులో వేరే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకే రాజధాని అని అంటే అప్పుడు మూడు ప్రాంతాల ప్రజలు అయోమయానికి గురి కాకా తప్పదు. ప్రభుత్వ వాదన ప్రకారం మూడు రాజధానుల వలన మూడు ప్రాంతాలు అభివృద్ధి సాధించకుంటే పరిస్థితి ఏమిటి ? ఆ ప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరిగితే భాద్యత ఎవరిది . జగన్ ప్రభుత్వం భాద్యత వహిస్తుందా?