https://oktelugu.com/

కాపులు ఐక్యత కోసం బీజేపీలోకి ముద్రగడ?

ఏపీలో బీజేపీ బలపడేందుకు యత్నిస్తుంది. కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి ఉండటంతో అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళుతోంది. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు లేనప్పటికీ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ దీటుగా బీజేపీ ఏపీలో రాజకీయాలు చేస్తుండటం విశేషం. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీ బలపడేందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రచిస్తుంది. Also Read: రాజధాని రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఆఫర్ ఇదేనా? ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 3, 2020 / 08:24 PM IST
    Follow us on


    ఏపీలో బీజేపీ బలపడేందుకు యత్నిస్తుంది. కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి ఉండటంతో అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళుతోంది. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు లేనప్పటికీ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ దీటుగా బీజేపీ ఏపీలో రాజకీయాలు చేస్తుండటం విశేషం. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీ బలపడేందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రచిస్తుంది.

    Also Read: రాజధాని రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఆఫర్ ఇదేనా?

    ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించిన జనసేనతో పొత్తుపెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూటమిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఏపీలో బలంగా ఉన్న కాపు ఓట్లను గంపగుత్తగా తన ఖాతాలో వేసుకుంటున్నందుకు కసరత్తులు చేస్తోంది. జనసేన ఓటు బ్యాంకులో కాపుల మెజార్టీ ఎక్కువగా ఉంది. జనసేనతో పొత్తు కారణంగా ఇధి ఆ పార్టీకి కలిసిరానుంది. దీంతో కాపుల్లో బలంగా ఉన్ననేతలపై బీజేపీ దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా ముద్రగడ పద్మానాభానికి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు రెడీ అవుతుందనే ప్రచారం జరుగుతోంది.

    ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం గతంలో ఉద్యమం చేపట్టారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏపీలో కాపు ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అయితే ఈ ఉద్యమాన్ని బాబు తీవ్రంగా అణిచివేశారు. ఆ తర్వాత కొద్దిరోజులపాటు సైలంటయ్యారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఒకటిరెండు కాపు ఉద్యమం కోసం లేఖలు రాశారు. పద్మనాభం వైసీపీని గట్టిగా నిలదీయకుండా జగన్ కు మద్దతు పలుకుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మనస్థాపం చెంది కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

    Also Read: బాబు మార్క్ రాజకీయాలు షూరూ?

    తాజాగా ఆయన మళ్లీ రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారుతున్నారనే టాక్ విన్పిస్తోంది. పద్మనాభంకు బీజేపీ మంచి పదవీ ఇచ్చి ఆ పార్టీలోకి ఆహ్వానించిందనే సమాచారం. దీంతో ఆయన బీజేపీలోకి చెరేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాపుల్లో బలమైన నేతలుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, సొము వీర్రాజులు బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. జనసేన ఎలాగూ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ముద్రగడను కూడా బీజేపీలో చేర్చుకోవడం ద్వారా కాపు ఓట్లను గంపగుత్తగా లాగాలని చూస్తోంది. టీడీపీ, వైసీపీకి చెందిన కాపు నేతలను కూడా బీజేపీకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కాపు నేతలందరినీ ఐక్యం చేస్తున్న బీజేపీలోకి ముద్రగడ వెళుతారా? లేదో వేచిచూడాల్సిందే..!