12 రోజుల్లో 10లక్షల కరోనా కేసులు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా రక్కసి విజృంభన ఇంకా తగ్గక పోగా రోజు రోజుకి ఎక్కువవుతుంది. గడించిన 12 రోజుల్లో 10 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 3నాటికి 10 లక్షలు దాటినా కరోనా కేసుల సంఖ్య అక్కడనుండి జడ్ స్పీడ్ తో దూసుకెళ్లి 12 రోజుల్లోనే 20 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 19 లక్షల 76 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అందులో మరణించిన వారి సంఖ్య 1 లక్ష 28 వేలు దాటింది. […]

Written By: Neelambaram, Updated On : April 15, 2020 2:53 pm
Follow us on

ప్రపంచవ్యాప్తంగా కరోనా రక్కసి విజృంభన ఇంకా తగ్గక పోగా రోజు రోజుకి ఎక్కువవుతుంది. గడించిన 12 రోజుల్లో 10 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 3నాటికి 10 లక్షలు దాటినా కరోనా కేసుల సంఖ్య అక్కడనుండి జడ్ స్పీడ్ తో దూసుకెళ్లి 12 రోజుల్లోనే 20 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 19 లక్షల 76 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అందులో మరణించిన వారి సంఖ్య 1 లక్ష 28 వేలు దాటింది. 4 లక్షల 73 వేల మంది కొలుకున్నారు.

భారత్ లో కూడా కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి.గడిచిన వారం రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యాయి. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం 8 గంటలకు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 11,439 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్ కారణంగా 38 మరణాలు సంభవించగా, కొత్తగా 1076 కేసులు నమోదయ్యాయి.

ఇదిలావుండగా, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు పెంచడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఈ రోజు వివరణాత్మక మార్గదర్శకాన్ని జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఏప్రిల్ 20 నుండి అనేక ప్రాంతాలు షరతులతో పనిచేయడానికి అనుమతించబడ్డాయి. కరోనా వైరస్ కారణంగా భారత్ లో ఇప్పటివరకు మొత్తం 377 మంది మరణించారు, 1,305 మంది కోలుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం..బుధవారం ఉదయానికి తెలంగాణలో 644పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 18మంది మరణించారు. మొత్తం బాధితుల్లో 110మంది కోలుకోగా ప్రస్తుతం 516 మంది చికిత్స పొందుతున్నారు. కేవలం మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 52పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గడచిన 24గంటల్లో నగరంలో కొత్తగా 40కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఇక ఆంధ్రప్రదేశ్‌ లో ఈ వైరస్‌ సోకి 9మంది మరణించగా మొత్తం 486మందికి సోకింది. వీరిలో కేవలం ఒక్క గుంటూరు జిల్లాలోనే 114 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో కూడా వైరస్‌ తీవత్ర పెరిగింది. ఇప్పటివరకు కర్నూలులో 93 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.